ముగిసిన ఓ స్వర్ణయుగం.. ఫుట్‌బాల్ దిగ్గజాలల అంతర్జాతీయ ప్రయాణానికి ఎండ్ కార్డ్

దశాబ్దానికి పైగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను తమ అసాధారణ ఆటతీరుతో ఏలిన పలువురు దిగ్గజ ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ఈ ప్రపంచకప్‌తో తెరపడింది.

Update: 2026-07-21 10:14 GMT

ఫుట్‌బాల్ ప్రపంచంలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఫిఫా వరల్డ్‌కప్ ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని మాత్రమే కాదు... సరికొత్త చరిత్రను కూడా సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించే ఈ అతిపెద్ద క్రీడా ఈవెంట్ తాజాగా 2026 ఎడిషన్‌తో మరపురాని క్షణాలకు వేదికగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా పరాజయం పాలవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసినప్పటికీ... ఈ టోర్నీ ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఒక అద్భుతమైన 'స్వర్ణయుగానికి' ముగింపు పలికిందనేది పచ్చి నిజం.

దశాబ్దానికి పైగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను తమ అసాధారణ ఆటతీరుతో ఏలిన పలువురు దిగ్గజ ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ఈ ప్రపంచకప్‌తో తెరపడింది. తమ జాతీయ జట్ల తరఫున దశాబ్దాల పాటు సేవలు అందించిన స్టార్ ప్లేయర్లు ఇకపై అంతర్జాతీయ వేదికలపై కనిపించరనే వార్త అభిమానుల హృదయాలను పిండేస్తోంది.

దిగ్గజాల భావోద్వేగ వీడ్కోలు

లియోనెల్ మెస్సీ : 2022లో అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించి తన కల నెరవేర్చుకున్న మెస్సీ 2026 ఫైనల్ ఓటమితో తన సుదీర్ఘ ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలికారు. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిగా నిలిచిన మెస్సీకి ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన క్షణం.

క్రిస్టియానో రొనాల్డో : పోర్చుగల్ రికార్డుల వీరుడు రొనాల్డో మరో ప్రపంచకప్ ఆడాలనే ఆసక్తిని వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ తదుపరి టోర్నీ నాటికి ఆయన వయస్సు 45 ఏళ్లకు చేరుకుంటుంది. దీంతో ఫిట్‌నెస్, వయసు రీత్యా ఆయన మళ్లీ మైదానంలో కనిపిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.

నెయ్మార్ & కెవిన్ డి బ్రూయిన్ : బ్రెజిల్ పోరాట యోధుడు నెయ్మార్ ఇప్పటికే జాతీయ జట్టుకు గుడ్‌బై చెప్పగా.. బెల్జియం సాధించిన ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో కీలక పాత్ర పోషించిన 'మాస్టర్ ప్లేమేకర్' కెవిన్ డి బ్రూయిన్ కూడా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికారు.

శకం ముగిసింది.. జ్ఞాపకాలు శాశ్వతం

వీరితో పాటు మరికొందరు సీనియర్ దిగ్గజ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీ తర్వాత రిటైర్మెంట్ బాట పట్టడంతో ఒక తరం అభిమానులు మైమరిచి చూసిన ఫుట్‌బాల్ శకం అధికారికంగా ముగిసిందనే భావన బలపడింది.

ఫుట్‌బాల్ అభిమానులకు 2026 ప్రపంచకప్ కేవలం ఒక సాధారణ టోర్నీ మాత్రమే కాదు.. ఇది మెస్సీ-రొనాల్డో యుగానికి గంభీరమైన వీడ్కోలు పలికిన చారిత్రక ఘట్టం. కొత్త తరం ఆటగాళ్లు రాబోయే రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తున్నప్పటికీ.. ఈ దిగ్గజాలు సృష్టించిన మాయాజాలాన్ని, నెలకొల్పిన రికార్డులను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.

Tags:    

Similar News