• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  టెస్టు క్రికెట్‌లో...

టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలు.. పంత్‌ ఖాతాలో అరుదైన ఘనత

| న్యూజిలాండ్ గడ్డపై టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 720/9 స్కోరు చేసి డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ సెంచరీలు చేయగా, గిల్, జైస్వాల్, పడిక్కల్, జురెల్ అర్ధ శతకాలతో రాణించారు. వరుసగా ఏడు వికెట్ల వరకు 50కి పైగా పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసి అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది.

By - A.N.Kumar
Update: 2026-11-22 04:32 GMT

క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్ అంటే ఓపిక.. పట్టుదల.. సవాళ్లను ఎదుర్కొనే తెగువ. కానీ టీమ్‌ఇండియా బ్యాటర్లు మాత్రం టెస్టు ఆటకే సరికొత్త నిర్వచనం రాశారు. న్యూజిలాండ్ గడ్డపై.. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం ఊపిరి సలపనివ్వకుండా పరుగుల వరద పారించారు. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ప్రతి బ్యాటర్ బాధ్యత పంచుకుంటూ.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 720/9 వద్ద డిక్లేర్ చేసి టెస్టు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రదర్శన చేసింది.

ఈ ఇన్నింగ్స్‌ను కేవలం భారీ స్కోరుగా మాత్రమే చూడలేం.. ఇది టీమ్‌ఇండియాలోని సమష్టి ఆధిపత్యానికి.. డ్రెస్సింగ్ రూమ్‌లోని పట్టుదలకు నిదర్శనం. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ అద్భుతమైన సెంచరీలతో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. వారికి తోడుగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ అర్ధ శతకాలతో రాణించి స్కోరు వేగాన్ని నిలబెట్టారు.

ఈ ప్రదర్శనలో మరో ప్రత్యేకత ఏమిటంటే టాప్-5 బ్యాటర్లు కనీసం 50 పరుగుల మార్కును అందుకోవడంతో పాటు వరుసగా ఏడో వికెట్ వరకు 50కి పైగా పరుగుల భాగస్వామ్యాలు నమోదయ్యాయి. టెస్టు క్రికెట్ చరిత్రలో మరే జట్టూ ఇంతకుముందు సాధించని అరుదైన రికార్డు ఇది. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను ఎంత అంకితభావంతో పోషించారో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు.

న్యూజిలాండ్ గడ్డపై.. ముఖ్యంగా వెల్లింగ్టన్‌లో భారత బ్యాటింగ్ ప్రదర్శన పలు పాత రికార్డులను తుడిచిపెట్టింది. 2019లో హామిల్టన్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ చేసిన 715/6 రికార్డును భారత్ 720/9 అధిగమించి న్యూజిలాండ్‌లో అత్యధిక టెస్టు జట్టు స్కోరుగా నిలిచింది. అలాగే 1995లో వెస్టిండీస్ నమోదు చేసిన 660/5 స్కోరును వెనక్కి నెట్టి వెల్లింగ్టన్‌లోనూ అత్యుత్తమ జట్టు స్కోరుగా కొత్త చరిత్ర సృష్టించింది.

టెస్టుల్లో 700కు పైగా పరుగులు చేయడం భారత్‌కు ఇది ఐదోసారి. ఈ జాబితాలో శ్రీలంక 7 సార్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక టీమ్‌ఇండియా టెస్టు చరిత్రలో ఇది మూడో అత్యధిక స్కోరు 2016లో ఇంగ్లాండ్‌పై 759/7, 2009లో శ్రీలంకపై 726/9 తర్వాత ఇదే అత్యధికం.. మరోవైపు భారత బ్యాటర్ల దూకుడు ముందు న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 33 ఓవర్లలో ఒక వికెట్ తీసి 201 పరుగులు సమర్పించుకోవడంతో టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో న్యూజిలాండ్ బౌలర్‌గా నిలిచాడు. 1989లో 229 పరుగులు ఇచ్చిన సీఫ్టెన్ బూక్ మొదటి స్థానంలో నిలిచాడు. ఆరు కంటే ఎక్కువ ఎకానమీతో 200+ పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గానూ ఈ జాబితాలో చేరాడు.

కష్టాలను ఎదుర్కొని.. తిరిగి మైదానంలో అడుగుపెట్టి తనదైన శైలిలో ఎదురుదాడి చేసే రిషభ్ పంత్ ప్రదర్శన ప్రతి యువ క్రీడాకారుడికి ఒక ప్రేరణ. ఈ మ్యాచ్‌లో అతని కెరీర్‌లో తొమ్మిదో టెస్టు సెంచరీ నమోదు కావడమే కాకుండా పలు చారిత్రక ఘనతలు అతని ఖాతాలో చేరాయి. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై టెస్టు సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. న్యూజిలాండ్‌పై అతనికి ఇదే తొలి టెస్టు శతకం కావడం మరింత విశేషం.

సిక్సర్ల వర్షంలోనూ పంత్ తనదైన ముద్ర వేశాడు. కేవలం 53 మ్యాచ్‌ల్లోనే 108 సిక్సర్లతో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుని.. బ్రెండన్ మెక్‌కల్లమ్ 107 రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో బెన్ స్టోక్స్ 138 సికర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రతి సిక్సర్‌కు పంత్ తీసుకుంటున్న బంతుల సగటు 47.93 బంతులకు ఒక సిక్సర్ అత్యుత్తమంగా ఉండటం అతని విధ్వంసక శైలికి అద్దం పడుతోంది.

ఒకే ఇన్నింగ్స్‌లో పర్వతమంత స్కోరు.. ప్రతి బ్యాటర్‌లో కనిపించిన బాధ్యత.. వరుస భాగస్వామ్యాలు.. పంత్ నిర్భయ శైలి.. ఇవన్నీ కలిసి టీమ్‌ఇండియా గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పాయి. క్రీడల్లో నిజమైన విజయం అంటే కేవలం గెలుపు మాత్రమే కాదు.. ఆట పట్ల నిబద్ధత.. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం.. జట్టుగా కలిసి నిలబడే తత్వం. ఈ ఇన్నింగ్స్ ఆ స్ఫూర్తికి సజీవ సాక్ష్యం..

Tags:    
  • teamindia 
  • rishabhpant 
  • klrahul 
  • testcricket 

Similar News

కోహ్లీలా కష్టపడాలి.. ధోనీలా పని చేయించాలి.. తిలక్ వర్మను ఆడించాలి.. అంబటి రాయుడు హాట్ కామెంట్స్

2026-11-21 08:35 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS