రాష్ట్రాల ఆగ్ర‌హంతో కేంద్రం వెన‌క్కి త‌గ్గిందా?

Update: 2019-06-03 09:55 GMT
కేంద్రం పెద్ద‌న్న పాత్ర‌ను పోషించే విష‌యంలో అప్పుడ‌ప్ప‌డు అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం మొద‌ట్నించి చూస్తున్న‌దే. ఇక‌.. మోడీ స‌ర్కారుకు ఈ విష‌యంలో మ‌రింత తొంద‌ర ఎక్కువ‌న్న విష‌యం తెలిసిందే. కెలికి మ‌రీ వివాదాల్ని తెర మీద‌కు  తీసుకురావ‌టంలో మోడీ ప్ర‌భుత్వానికి ఉన్నంత ఉత్సాహం మ‌రెవ‌రూ చూపించ‌లేరేమో? తాజాగా నూత‌న విద్యా విధానంపై కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెద్ద ఎత్తున ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే.

హిందీ మాట్లాడ‌ని రాష్ట్రాల్లో హిందీని పాఠ్యాంశంగా చేర్చాల‌ని కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ నిర్ణ‌యించ‌టం.. దీనిపై త‌మిళ‌నాడు.. క‌ర్ణాట‌క‌.. ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. హిందీని బ‌లవంతంగా రుద్ద‌టం స‌రికాద‌ని తేల్చి చెప్ప‌టం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం అంత‌కంత‌కూ ముదిరి.. మ‌రింత దూరం వెళ్లే అవ‌కాశం ఉన్న వేళ‌.. కేంద్రం కాస్త తెలివిని తెచ్చుకొని దిద్దుబాటు చ‌ర్య‌ల్ని షురూ చేసింది. హిందీ రుద్దుడు విష‌యంలో వెన‌క‌డుగు వేసేలా తాజాగా త‌న నిర్ణ‌యాన్ని ప‌రోక్షంగా వెల్ల‌డించింది. తాజా అంశంపై కేంద్రం పున‌రాలోచిస్తోంద‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా ఎలాంటి నిర్ణ‌యాన్ని తీసుకోబోమంటూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంక‌ర్ వ్యాఖ్యానించారు.

తాము అన్ని భాష‌ల్ని గౌర‌విస్తామ‌ని.. బ‌ల‌వంతంగా హిందీ అమ‌లు చేయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త విద్యా విధానాన్ని అమ‌లు చేస్తామ‌ని బీజేపీ త‌న ఎన్నిక‌ల హామీల్లో పేర్కొంద‌న్నారు. మొత్తానికి ఇస్రో మాజీ ఛైర్మ‌న్ క‌స్తూరీ రంగ‌న్ నేతృత్వంలోని తొమ్మిది మంది నిపుణుల క‌మిటీ తేల్చిన అంశాలు వివాదంగా మారిన వేళ‌.. కేంద్రం వెన‌క్కి త‌గ్గ‌టం మంచి ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News