హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద దారుణ హత్య
దీపావళి పండుగ రోజున షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ నడిబొడ్డుగా అభివర్ణించే నారాయణగూడ మెట్రో స్టేషన్ కింద గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. స్థానికంగా తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతం కొత్త ఆందోళనకు కారణంగా మారింది. ఈ హత్య జరిగిన తీరుపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మెట్రో స్టేషన్ లో ప్రయాణించటానికి వెళ్లిన ప్రయాణికులు హత్యకు గురైన వ్యక్తిని చూసి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఈ ఉదంతం తెర మీదకు వచ్చింది. సమాచారం అందుకున్న నారాయణగూడ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
హత్యకు గురైన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. ఇంతకీ ఈ హత్య ఎందుకు జరిగి ఉంటుందన్నది పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. క్లూస్ టీం సాయంతో పోలీసులు కొంత సమాచారం సేకరించారు. వారి వాదన ప్రకారం మద్యం మత్తులో వైటర్నర్ ల కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ గొడవ పెరిగి పెద్దదై..ఒక వ్యక్తి మరో వ్యక్తి తలపై బండరాయితో కొట్టటంతో అతడు అక్కడికక్కడే మరణించినట్లుగా చెబుతున్నారు
డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడే పోస్టు మార్టం నిర్వహించనున్నారు. ఇక.. హత్యకు కారణమైన వ్యక్తిని పట్టుకునే పనిలోపోలీసులు ఉన్నారు. ఏమైనా.. నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతంలో హత్య జరగటం ఇప్పుడు సంచలనంగా మారింది.