కరోనా కోరల్లో బ్రిటన్.. ప్రతి 10 మందిలో ఒకరికి పాజిటివ్
ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా.. ఒమిక్రాన్ వేరియంట్ పుణ్యమా అని.. ప్రపంచ దేశాలు ఇప్పుడు మళ్లీ భయాందోళనలకు గురవుతున్నాయి. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్.. వేగంగా విస్తరించుకుంటూ పోతోంది. ఇప్పటికే వంద దేశాలకు విస్తరించిన ఈ మాయదారి వేరియంట్.. ఇప్పుడు బ్రిటన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గడిచిన మూడు రోజులుగా రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజున బ్రిటన్ లో 1.21 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక.. బ్రిటన్ రాజధాని లండన్ లో అయితే కేసుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది.
డిసెంబరు 16 నాటికి బ్రిటన్ లోని ప్రతి ఇరవై మందిలో ఒకరికి కరోనా పాజిటివ్ కాగా.. తాజాగా పెరిగిన కేసులతో ప్రతి పది మందిలో ఒకరికి పాజిటివ్ గా తేలింది. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో కాస్తంత ఊరట కలిగించే అంశం ఒమిక్రాన్ బారిన పడిన వారు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువగా ఉందని చెబుతున్నారు. కరోనాతో మరణిస్తున్న వారి సంఖ్య రోరోజులు గడుస్తున్న కొద్దీ.. తకర్కువగా ఉన్నట్లుగా చెప్పాలి. ఇప్పటివరకు బ్రిటన్ లో కరోనా కారణంగా 1.47 లక్షల మంది మరణించారు. ఈ మరణాలు ఐరోపా ఖండంలోనే అత్యధిక మరణాల్ని నమోదు చేసిన దేశంగా బ్రిటన్ నిలిచింది.
యూకేలో కరోనా తీవ్రత భారీగా ఉంటే.. అందుకు భిన్నంగా గ్రేట్ బ్రిటన్ లో భాగమైన స్కాట్ లాండ్ లో ఇన్ఫెక్షన్ రేటు తక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. డిసెంబరు 19 నాటికి ఇక్కడ ప్రతి 65 మందిలో ఒకరికి కరోనా సోకగా.. తాజాగా మాత్రం ప్రతి 35 మందిలో ఒకరికి పాజిటివ్ అయినట్లుగా అంచనాలు ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో ప్రతి పాతిక మందిలో ఒకరికి కరోనా సోకే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్రిటన్ లోని మిగిలిన ప్రదేశాలతో పోలిస్తే.. స్కాట్లాండ్ లోనే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. కరోనా బ్రిటన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.