జంపింగ్ లకు అప్పుడే టార్గెట్లు పెట్టిన బీజేపీ!
రెండో దఫా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. కేంద్రంలో పగ్గాలు చేపట్టింది మొదలుకొని ఈ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టి ప్రజాప్రతినిధులు మొదులకొని సీనియర్ నేతలు - మాజీమంత్రులకు ఆ పార్టీ వల వేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలకు బీజేపీ కండువా కప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులనే పేరున్న వారు ఇందులో ముగ్గురు ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలోని పలువురు మాజీలకు సైతం బీజేపీ కండువా కప్పారు. అయితే, ఇప్పుడు ఆ నేతలకు బీజేపీ పెద్దలు టార్గెట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నేతలకు టార్గెట్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ మెంబర్ షిప్ తో పాటు చేరికలపైనా బీజేపీ దృష్టి సారించి అన్ని జిల్లాల్లో పార్టీకి బలమైన నేతలు ఉండాలన్న లక్ష్యంతో రెండు నుంచి మూడు అసెంబ్లీ సెగ్మెంట్లను ప్రభావితం చేయగల లీడర్లకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణను నిజామాబాద్ - సూర్యాపేటకు - జితేందర్ రెడ్డిని కరీంనగర్ - నాగర్ కర్నూల్ కు - పొంగులేటి సుధాకర్ రెడ్డిని కొత్తగూడెం - చాడ సురేశ్ రెడ్డిని వనపర్తి - మహబూబాబాద్ - బోడ జనార్దన్ ను గద్వాల - మంచిర్యాలకు - శశిధర్ రెడ్డిని వరంగల్ రూరల్ - సంగారెడ్డికి - విజయరామారావుకు జనగామ - భూపాలపల్లి జిల్లాల్లో మెంబర్ షిప్ బాధ్యతలు అప్పగించారు.
పార్టీ సభ్యత్వాలతో పాటుగా చేరికలకు సైతం బీజేపీ పెద్దలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ - టీడీపీలోని లీడర్లతోపాటు టీఆర్ ఎస్ లోని అసంతృప్తులపైనా పార్టీ కన్నేసింది. కాంగ్రెస్ లోని కొందరు మాజీ మంత్రులు - మాజీ ఎంపీలు - మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉండగా వారికి ఇప్పుడే సభ్యత్వం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇలా వివిధ పార్టీల నుంచి చేరికలకు సిద్ధంగా ఉన్న వారి వివరాలు సైతం తెలియజేయాలని వెల్లడించినట్లు సమాచారం. మొత్తంగా ఇతర పార్టీల నుంచి చేరిన నేతలను ఖాళీగా ఉంచకుండా సభ్యత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేయాలని హైకమాండ్ సూచించడం చర్చనీయాంశంగా మారింది.