బ్రేకింగ్: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కరోనా

Update: 2020-08-26 04:45 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. విస్తృతంగా వ్యాపిస్తోంది. ఏపీలో రోజుకు 10వేల చొప్పున  కేసులు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ సోకుతోంది.

తాజాగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. భూమనతోపాటు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. వైద్యుల సలహా మేరకు తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. వారం రోజులుగా కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే కరోనా బారినపడ్డారు.

ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన ప్రజలు, నేతలు, పార్టీ కార్యకర్తలు పరీక్షలు చేయించుకోవాలని భూమన కోరారు. అందరూ ఐసోలేషన్ లో ఉండాలని కోరారు.
Tags:    

Similar News