బోరగడ్డ అనిల్ విషయం లో ఇలా చేయడం వైసీపీకి మరింత బ్యాడ్ . . !
వాస్తవానికి బోరగడ్డ అనిల్ కుమార్ 2014, 2019, 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశారు. ఇదే సమయంలో ఆయన టిడిపి, జనసేన నాయకులను తీవ్రంగా విమర్శించారు.;
తాజాగా జరిగిన కీలక పరిణామాల్లో వైసిపి పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2014 నుంచి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీకి, ఆ పార్టీ నాయకులకు కూడా సపోర్టుగా నిలిచిన బోరగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం ఇప్పుడు పార్టీలోనే కాదు ఎస్సీ సామాజిక వర్గంలో కూడా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి బోరగడ్డ అనిల్ కుమార్ 2014, 2019, 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశారు. ఇదే సమయంలో ఆయన టిడిపి, జనసేన నాయకులను తీవ్రంగా విమర్శించారు.
ఇవి తర్వాత కాలంలో కేసులుగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే తాజాగా వైసిపి అసలు ఆయనకి మాకు సంబంధం లేదని పార్టీతో అనిల్ కుమార్కు ఎలాంటి టచ్ కూడా లేదని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. దీనిపై ఎస్సీ సామాజిక వర్గాలు నిప్పులు జరుగుతున్నాయి. అవకాశవాదంగా వైసిపి వ్యవహరిస్తుందన్న చర్చ కూడా నడుస్తోంది. వాస్తవానికి బోరగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయినప్పుడు గత ఏడాది వైసిపి నాయకులు సపోర్టు చేశారు.
ఆయన పై అనవసరంగా కేసులు పెట్టారని, అన్యాయంగా ఇరికించారని చెప్పారు. కానీ, ఇప్పుడు కేసుల తీవ్రత పెరగడం, అనిల్ కుమార్ అప్రూవర్‌గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు పార్టీతో సంబంధమే లేదన్నట్టుగా వైసిపి వ్యవహరించటం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇలా చేయడం వైసిపికి మరింత బ్యాడ్ అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గంలో జగన్ కి ఒక ఇమేజ్ ఉంది. దానిని కాపాడుకునే దిశగా అడుగులు వేయాల్సిన జగన్ ఇప్పుడు అనూహ్యంగా బోరగడ్డ అనిల్ కుమార్ విషయంలో యూటర్న్ తీసుకోవడం కరెక్ట్ కాదన్నది వారి వాదన.
ఒకవేళ అనిల్ కుమార్ అప్రూవర్‌గా మారితే.. తను పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు కుటుంబం మీద దాడి చేశానని, జగన్ చెప్పారు కాబట్టే చేశానని చెప్పే అవకాశం ఉందని అందుకే ఇప్పుడు యూటర్న్ తీసుకుని తమ చేతికి మట్టి అంటకుండా చేసుకుంటున్నారు అన్న చర్చ నడుస్తోంది. ఇది సరికాదు అన్నది పరిశీలకులు చెబుతున్న మాట. ఇలా చేయడం వల్ల ఎస్సీ సామాజిక వర్గంలో వైసిపి పై ఉన్న ఇమేజ్ తో పాటు జగన్ పై ఉన్న సానుభూతి కూడా తగ్గిపోతుందని వారు చెబుతున్నారు.
మొత్తంగా అనిల్ కుమార్ విషయంలో వైసిపి తీసుకుంటున్న స్టాండ్ సరికాదన్న వాదన వినిపిస్తుంది. నిజానికి ఆయనతో సంబంధం లేకపోయి ఉంటే గత ఏడాది నాయకులు ఆయనకు మద్దతుగా ఎందుకు ప్రకటనలు చేశారు. ఎందుకు మద్దతుగా నిలిచారు అనేది ప్రశ్న. అంతేకాదు.. తనను జగనే స్వయంగా జైలు నుంచి బయటకు తెచ్చారని కూడా బోరగడ్డ చెప్పడం గమనార్హం.