జ‌గ‌న్‌కు విష‌మ ప‌రీక్ష‌లు మొద‌ల‌య్యాయా..?

రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. పరిస్థితులను బట్టి కాలమాన స్థితిగతులను బట్టి కూడా రాజకీయాలు మార్పు చెందుతూ ఉంటాయి.;

Update: 2025-12-12 12:30 GMT

రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. పరిస్థితులను బట్టి కాలమాన స్థితిగతులను బట్టి కూడా రాజకీయాలు మార్పు చెందుతూ ఉంటాయి. వీటిని తట్టుకుని నిలబడడం అనేది నాయకులకు ప్రధాన విషయం. తాజాగా వైసిపి అధినేత జగన్‌కు మరిన్ని విషమ ప‌రీక్షలు ఎదురవుతున్నాయి అన్న వాదన వినిపిస్తోంది. నిజానికి అనేక సమస్యలు అనేక సుడిగుండాలు దాటుకునే జగన్ వచ్చారని ఆ పార్టీ నాయకులు తరచుగా చెప్పే మాట.

2014కు ముందు కాంగ్రెస్ ను ఎదిరించి ఆయన పార్టీ పెట్టడం తర్వాత 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం వంటి పరిణామాలు ఆయన నిబద్ధతకు ధైర్యానికి ప్రతీకగా చెబుతారు. అయితే ఇప్పుడు ఆనాటి పరిస్థితుల కన్నా కూడా మరిన్ని ఎక్కువ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవైపు కీలక నాయకుల అరెస్టు. మరోవైపు చుట్టుముడుతున్న కేసులు. ఇప్పటికే మద్యం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు అనేకమంది కీలక నాయకులు అధికారులు కూడా అరెస్టయ్యారు.

కొందరు బెయిల్ పై వచ్చారు. ఇక కీలక నాయకుడు జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జైల్లోనే ఉన్నారు. తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి జంట హత్యల‌ కేసులో అరెస్టు అయ్యారు. ఈ పరిణామాలు వైసిపికి మరింత ఇబ్బందికరంగా మారుతు న్నాయి. ఎందుకంటే నాయకులను ఆధారంగా చేసుకుని కొన్ని కొన్ని జిల్లాల్లో రాజకీయాలు న‌డుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి నాయకులు జైలు పాలు అయితే పార్టీ పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్న.

మళ్ళీ కొత్త నాయకుడుని పెట్టుకోవడం పార్టీ డెవలప్ చేసుకోవడం అనేది ఇప్ప‌ట్లో సాధ్యమయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇది ఇలా ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి విచారణకు వచ్చింది. దీనిని నెల రోజులలోపు పూర్తి చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇది ఒక కీలక పరిణామం. ఇప్పటివరకు జరిగిన విచారణతో పాటు ఇప్పుడు మరి కొంతమందిని కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది.

ఇక పార్టీ పరంగా నాయకుల మధ్య విభేదాలు ఎక్కడా తగ్గడం లేదు. మరోవైపు కేంద్రం నుంచి వచ్చే సహకారం కూడా అందుబాటులో లేకుండా పోయే సూచనలు కనిపిస్తున్నాయి. బిజెపి మద్దతు దాదాపు సన్నగిల్లే అవకాశం కూడా ఉంది. రాష్ట్రంలో కూటమి బలపడితే అది బిజెపికి మరింత మేలు జరుగుతుంది. వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇదే స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని బట్టి జగన్కు ఇప్పటికన్నా మరిన్ని కష్టాలు ఇబ్బందులు భవిష్యత్ కాలంలో ఎదురవుతాయి అన్నది పరిశీలకులు చెబుతున్న మాట.

వీటిని తట్టుకుని నిలబడి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి ఏ మేరకు తీసుకు వస్తారన్నది జగన్ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఈలోపే ఆయనపై ఉన్న క్రమ కేసులు కూడా బలపడితే అవి కూడా విచారణకు వస్తే పరిస్థితి ఏంటన్నది మరో ప్రశ్న. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే రాబోయే ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం జగన్ పై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.

అప్పుడు సహజంగా కేంద్రంలోని బిజెపి కూడా కూటమికి సహకరించక‌ తప్పదు. ఈ పరిణామాలను గమనిస్తే జగన్‌కు వ‌చ్చే ఎన్నిక‌లు అంత తేలికగా అయితే సాధ్యం కాదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏం చేస్తార‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News