సౌర తుఫాన్....భారత్ కి పెను ముప్పు

ఇక సౌర తుఫాన్ తీవ్రతను బట్టి అసాధారణ సంఘటనలు కూడా జరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని ఇస్రో అంటోంది.;

Update: 2026-02-04 17:18 GMT

సూర్యుడు తన విశ్వ రూపం చూపిస్తాడా, దాని ప్రభావం ఎంత ఏ దేశాల మీద ఉండనుంది. భారత్ కి ఏ మేరకు ముప్పు ఏర్పడుతుంది అంటే అంతరిక్ష పరిశోధనా సంస్థలు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే భారత్ కి ముప్పు ఉందని తేలుస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ నాసా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దాంతో అప్రమత్తంగా ఉంటూ అధ్యయనం చేస్తున్నామని అంటున్నారు.

ప్రతీ పదకొండేళ్ళు :

సౌర వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తాయి. అలాగే ప్రతీ పదకొండేళ్ళకు ఒకసారి సూర్యుడు తాను ఉన్న దాని నుంచి నూతన సౌర చక్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయమో అయస్కాంత క్షేత్రం కూడా మారుతుంది. దీంతో సూర్యుడు మహోగ్ర రూపం దాలుస్తాడు. ఆ మీదట సూర్యుడి నుంచి అత్యంత శక్తివంతమైన సౌర జ్వాలలు వెలువడతాయి. అవి పెద్ద ఎత్తున భూమి మీదకే వస్తాయి. ఈ ప్రభావం మానవాళి మీద పడదు కానీ ఉప గ్రహాలు అలాగే విద్యుత్, అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థల మీద తీవ్రంగా పడుతుందని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా సౌర వ్యవస్థలో మార్పులు గమనించినట్లుగా ఇస్రో చెబుతోంది. సూర్యుడి మీద భారీ ఎత్తున సౌర జ్వాలలు ఏర్పడినట్లుగా కూడా ఇస్తోతో పాటుగా నాసా సైతం చెబుతోంది. ఈ పరిణామాలు భారత్ కి ఎక్కువగా ముప్పు తెస్తాయని అంటున్నారు.

ఏమి జరుగుతుందంటే :

సౌర తుఫాన్ వల్ల ఏమి జరుగుతుంది అంటే రేడియో బ్లాక్ అవుట్ లు సంభవిస్తాయని చెబుతున్నారు. తీవ్రమైన స్థాయిలో సౌర తుఫానులు ఏర్పడి అవి నేరుగా భూమిని తాకితే ఉప గ్రహాలు కూడా దెబ్బ తినే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా టీవీ సిగ్నల్స్ అలాగే రాడార్లు విద్యుత్ గ్రిడ్లు దెబ్బ తింటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కి చెందిన దాదాపుగా ఉన్న యాభైకి పైగా ఉప్ర గ్రహాలను పర్యవేక్షించే కీలక బాధ్యతలను ఇపుడు ఇస్రో నిర్వహిస్తోంది. ఇక సౌర తుఫాన్ వల్ల భారత్ లోని కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినడంతో పాటు నావిగేషన్, అలాగే ఉప గ్రహ పరికరాలు దెబ్బ తింటాయని కూడా ఇస్రో అధికారులు అంచనా వేస్తున్నారు.

అసాధారణ ఘటనలు కూడా :

ఇక సౌర తుఫాన్ తీవ్రతను బట్టి అసాధారణ సంఘటనలు కూడా జరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని ఇస్రో అంటోంది. అదే విధంగా అలాంటివి జరిగినపుడు తగిన విధంగా స్పందిస్తామని ఇస్రో అధికారులు అంటున్నారు. ఇక రేడియో బ్లాక్ అవుట్ లు వచ్చే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో కమ్యూనికేషన్ వ్యవస్థకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇస్రో అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు సౌర తుఫాన్ విషయం మీద ఇప్పటికే గ్రౌండ్ స్టేషన్లకు మిషన్ కంట్రోల్ సెంటర్లకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా వెల్లడిస్తున్నాయి.

గత రెండు రోజులుగా :

ఇదిలా ఉంటే సౌర వ్యవస్థలో ప్రస్తుతం సౌర జ్వాలల తాకిడి వాటి స్థాయి తీవ్రతరంగా ఉంది అని అంటున్నారు. ఈ ఏడాదిలో ఇది అత్యంత శక్తివంతమైన సౌర జ్వాలగా చెబుతున్నారు. ఇక నాసా ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే కనుక ఫిబ్రవరి 1, 2 తేదీల మధ్యలో సౌర జ్వాలలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. 1996 నుంచి చూస్తే సౌర తుఫాన్ లో అతిపెద్ద వాటిలో ఇది రెండవదిగా చెబుతున్నారు.

సమాచారం ఇస్తున్న ఆదిత్య :

సరైన సూర్యుడి మీద సౌర తుఫాన్ సమాచారాన్ని ఆదిత్య -ఎల్ వన్ ఇస్రోకి అందిస్తోంది. దీని ఆ మధ్య ఇస్రో ప్రయోగించిన సంగతి తెల్సిందే. సూర్యుడు మీద జరిగే మార్పులను గమనించి సమాచారం అందించడమే ఆదిత్య -ఎల్ వన్ ఇతర దేశాల కంటే ముందుగానే భారత్ కి అందిస్తోంది. ఇది భారత్ కి ఇస్రోకి ఎంతో అడ్వాంటేజ్ గా ఉంది. ఆదిత్య -ఎల్ వన్ అన్నది భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడి ఎల్ వన్ వద్ద ఆదిత్య-ఎల్ వన్ ల్యాండ్ అయి సౌర్య వ్యవస్థలో జరిగే మార్పులు అన్నీ గమనించి రికార్డు చేస్తూ ఇస్రోకు పంపుతోంది. దాంతో ఎంతో నమ్మకమైన డేటా ఆసరాతో ఇపుడు సౌర తుఫాన్ల ప్రభావాన్ని సైతం ఎదుర్కోవడానికి ఇస్రో సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News