ఆపరేషన్ తెలంగాణా-బీజేపీ కొత్త చీఫ్ బిగ్ సౌండ్

ఒక వైపే తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, కొన్ని వర్గాలకే సంతృప్తి పరిస్తే చాలు అనుకుంటోంది అని నితిన్ నబీన్ పదునైన విమర్శలే చేశారు.;

Update: 2026-02-05 00:30 GMT

తెలంగాణా రాజకీయాల్లో తన పాత్ర పటిష్టం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. 2028 ఎన్నికలను టార్గెట్ చేస్తోంది. మరో రెండున్నరేళ్ళలో జరిగే ఎన్నికల్లో తొలిసారి కమల వికాసం జరగాలని చూస్తోంది. దాని కోసం బీజేపీ ఆపరేషన్ తెలంగాణా అంటూ రెడీ అవుతోంది. తెలంగాణా కొట్లాడి తెచ్చింది బీఆర్ఎస్ అయితే ఆ పార్టీకి రెండు సార్లు ప్రజలు అధికారం కట్టబెట్టారు, మరి ఇచ్చినది కాంగ్రెస్ అంటూ ఆ పార్టీ జనం వద్దకు వెళ్తే 2023 ఎన్నికల్లో గెలిపించారు. ఇక కాంగ్రెస్ తో పాటు తాము కూడా బలమైన విపక్షంగా ఉండి తెలంగాణా ఇవ్వడానికి కారణం అయ్యాం కదా తమ వాటా కూడా ఉండాలి కదా అంటోంది బీజేపీ. ఇక బీజేపీ బలం చూస్తే 2014 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా బలం పెంచుకుంది. ఇపుడు మునిసిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ కీలకమైన ఎన్నికల వేళ తెలంగాణాలో బీజేపీ కొత్త ఆలోచనలు చేస్తోంది.

ఫస్ట్ టైం అక్కడే :

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా గత నెలలో పదవీ బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ దక్షిణాదిన తెలంగాణాలోనే తొలి పర్యటన చేపట్టారు. అందులోనూ తెలంగాణా సీఎం సొంత ఇలాకాకే వెళ్ళి బిగ్ సౌండ్ చేశారు. తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో నితిన్ నబీన్ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణా బీజేపీకి దిశా నిర్దేశం చేసేలా పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలో ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లుగానే ఆయన ప్రసంగం సాగింది. రేవంత్ రెడ్డి పాలనను ఆయన సంతుష్టీకరణతో కూడిన పాలనగా అభివర్ణించడం విశేషం.

కొందరికే మేలు :

ఒక వైపే తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని, కొన్ని వర్గాలకే సంతృప్తి పరిస్తే చాలు అనుకుంటోంది అని నితిన్ నబీన్ పదునైన విమర్శలే చేశారు. తెలంగాణాలో ముస్లిం మైనారిటీ వర్గాల మేలు కోసమే రేవంత్ సర్కార్ పనిచేస్తోంది అని సూటిగానే ఎటాక్ చేశారు. ఇతర వర్గాలని పట్టించుకోవడం లేదని నిందించారు. ఇక అవినీతి అక్రమాలతో పాలన సాగుతోంది అన్నారు అంతే కాకుండా ఆర్ ఆర్ టాక్స్ ని విధిస్తున్నారు అని ద్వజమెత్తారు. ఆర్ ఆర్ అంటే రేవంత్ రెడ్డి టాక్స్ అన్న మాట. ఈ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద బీజేపీ ఏ విధంగా పోరాడ బోతోందో ఒక విధంగా స్పష్టం చేసే ప్రయత్నం చేసారు.

హిందూత్వ కార్డుతోనే :

బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ హిందూత్వ కార్డుతో తెలంగాణా రాజకీయాల్లో బీజేపీకి విజయం సాధించాలని ఒక వ్యూహంతో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. కాంగ్రెస్ కేవలం ఒక వర్గం కోసమే అనడం ద్వారా అతి పెద్ద మెజారిటీ వర్గాలను తమ వైపునకు తిప్పుకునే ప్లాన్ ఇందులో ఉంది అని అంటున్నారు. అంతే కాకుండా అవినీతి అక్రమాలు అని ఆయన సమాజంలో అసంతృప్తి వర్గాలకు చేరువ అయ్యే ప్రయత్నం చేశారు. అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శలు సంధించారు వీటిని బట్టి చూస్తే తెలంగాణా రాజకీయాల్లో బీజేపీ తన ఫోకస్ ఏమిటి ఏ విధంగా ముందుకు సాగాలన్నది కొత్త అధ్యక్షుడు డైరెక్షన్ చేశారు అని అంటున్నారు. రానున్న రోజులలో బీజేపీ ఏ విధంగా ముందుకు సాగుతుంది అన్నది చూడాలి మరి.

Tags:    

Similar News