బంగ్లాదేశ్ న‌టికి బీజేపీ తీర్థం!

Update: 2019-06-06 05:34 GMT
బీజేపీ కీర్తి దేశాల్ని దాటేస్తుందా?  విదేశీయులు సైతం పార్టీలో చేరుతున్నారా? అంటే అవున‌ని చెప్పాలి. ప్ర‌ముఖ బంగ్లాదేశ్ న‌టి అంజు ఘోష్‌ తాజాగా బీజేపీ కండువా క‌ప్పుకున్న వైనం ఇప్పుడు కొత్త సంచ‌ల‌నంగా మారింది. దేశం కాని దేశానికి చెందిన న‌టికి బీజేపీ స‌భ్య‌త్వం ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఆమె త‌న పౌర‌స‌త్వానికి సంబంధించిన స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఇంత‌కీ ఆ బంగ్లాదేశ్ న‌టి ఎవ‌రన్న విష‌యానికి వెళితే.. 1989లో విడుద‌లై బెడెర్ మెయ్ జోస్నా అనే మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌ట‌మే కాదు.. బంగ్లాదేశ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ త‌ర్వాత ఆమె బెంగాలీ చిత్రాల్లో న‌టించారు. ఇదిలా ఉంటే.. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బంగ్లాదేశ న‌టుడు పిర్దౌస్ అహ్మ‌ద్ కు వ్య‌తిరేకంగా బీజేపీ నేత‌లు ఫిర్యాదు చేయ‌టంతో కేంద్ర హోంశాఖ అత‌డి బిజినెస్ వీసాను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేకాదు.. త‌క్ష‌ణ‌మే దేశం నుచి వెళ్ల‌పోవాల‌ని

అలాంటిది తాజాగా బీజేపీ నేత‌లే..ఒక బంగ్లాదేశ్ న‌టికి పార్టీ అభ్య‌త్వం ఇవ్వ‌టం హాట్ టాపిక్ గా మారింది. తృణ‌మూల్ కాంగ్రెస్ అభ్య‌ర్థి జాతీయ‌త మీద సందేహాలు వ్య‌క్తం చేస్తూ.. తీసుకున్న నిర్ణ‌యానికి భిన్నంగా బీజేపీ బంగ్లా న‌టిని పార్టీలోకి ఆహ్వానించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోష‌ల్ మీడియాలోనూ ఇదే ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.




Tags:    

Similar News