బాబు పర్యటన.. రాజీనామా బాటలో కుప్పం తమ్ముళ్లు

Update: 2021-02-24 02:30 GMT
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార వైసీపీ ప్రభంజనం కొనసాగింది. ఎంతలా అంటే ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచిన సంగతి తెలిసిందే.

కుప్పంలో వైసీపీ గెలుపుపై అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. స్థానిక టీడీపీ నాయకులకు చీవాట్లు పెట్టారు. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన టీడీపీ నేతలు ఆయనకు ముఖం చూపించలేకపోతున్నారట..చంద్రబాబు తాజాగా కుప్పంలో ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించబోతున్నారట.. ఈ క్రమంలోనే ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని చర్చ జరుగుతోంది.

చాలా మంది టీడీపీ నేతలు ఇప్పటికే రాజీనామాలకు సిద్ధమవుతున్నారట.. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారట..పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న పీఎస్ మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్ ఏం చేయాలనేదానిపై కార్యకర్తలతో చర్చించారు. ఈ భేటీలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు కార్యకర్తలు. టీడీపీ సీనియర్ నేత గౌనివారి శ్రీనివాసులు సొంత పంచాయతీలోకే సర్పంచ్‌ను గెలిపించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతలు వైదొలుగుతారా? వారికి బాబు సర్ధి చెపుతారా? అన్నది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News