• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎవరు వెనక్కు తగ్గట్లేదుగా...

ఎవరు వెనక్కు తగ్గట్లేదుగా ?

By - Tupaki Desk
Update: 2022-01-22 11:30 GMT
పీఆర్సీ వివాదం విషయంలో రెండు వైపుల ఎవరూ వెనక్కు తగ్గట్లేదు. కొత్త పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేస్తే పాత పీఆర్సీ ప్రకారమే తమ జీతాలు కావాలంటు ఉద్యోగ సంఘాల నేతలు తీర్మానం చేశారు. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇదే సమయంలో విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కీలక నేతలు సమావేశమయ్యారు.

కొత్త పీఆర్సీనే అమలు చేయాలని క్యాబినెట్ డిసైడ్ చేసింది. అంటే ఉద్యోగులతో ఏదో ఒకటి తేల్చుకోవాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా అర్ధమైపోతోంది. ఇదే సమయంలో పాత పీఆర్సీ అమలు కోసం ఉద్యమాన్ని ఎంతస్ధాయికైనా తీసుకెళ్ళాలని ఉద్యోగ నేతల సమావేశం తీర్మానించింది. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో సహాయ నిరాకరణ, 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని ఉద్యోగ నేతలు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అంటే ఉద్యోగ నేతలు కూడా ప్రభుత్వం కథేంటో తేల్చుకోవాల్సిందే అన్నట్లుగా ఉన్నారు.

ఈనెల 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీలోగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేయాలని కూడా నేతలు డిసైడ్ చేశారు. మండల స్ధాయి తర్వాత నియోజకవర్గాలు ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో చేయబోయే ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించారు. ఫిబ్రవరి 3వ తేదీన రాష్ట్రంలోని నలుమూలల నుండి చలో విజయవాడ కార్యక్రమం జరుగుతుందని పిలుపిచ్చారు. అంటే ఫిబ్రవరి 3వ తేదీతో ఆందోళనలు పీక్ స్టేజికి చేరుకుంటాయన్నమాట.

ఇటు క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటంటే పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు నచ్చ చెప్పేందుకు ఐదుగురు సభ్యులతో కమిటి వేయాలని క్యాబినెట్ డిసైడ్ చేసింది. మంత్రులు పేర్నినాని, బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ ఉంటారు. అయితే ఈ కమిటితో ఉద్యోగ నేతలు భేటీ అయ్యేది అనుమానమే.  ప్రభుత్వం, ఉద్యోగుల నేతల ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడి ఉండటంతో చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Tags:    
  • PRC Issue 
  • AP PRC Issue 
  • Andhra Pradesh 
  • AP Sarkar 
  • AP employees 
  • Chief Secretary Sameer Sharma 
  • jagan mohan reddy 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS