• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ముందే జాగ్రత్త పడుతున్న...

ముందే జాగ్రత్త పడుతున్న మంత్రి అవంతి...?

By - Tupaki Desk
Update: 2022-03-23 23:30 GMT
విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు దాదాపుగా మూడేళ్ళ పాటు అమాత్య హోదాను అనుభవించేశారు. ఇక ఆయనకు మరోసారి  చాన్స్ లేదని తేలిపోయింది. విశాఖ నుంచి విస్తరణలో వంశీకి మంత్రి పదవి గ్యారంటీ అంటున్నారు. మొత్తానికి చూస్తే  అవంతి మాజీ కావడానికి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది అని అంటున్నారు.

ఈ విషయం మీద చాలా రోజులుగా ప్రచారం సాగుతూండడంతో మంత్రి గారు కూడా తగిన విధంగానే ప్రిపేర్ అయ్యారని అంటున్నారు. ఆయన ఫోకస్ ఇపుడు వచ్చే ఎన్నికల మీద ఉంది. మళ్ళీ భీమిలీ నుంచి పోటీ చేసి మూడవసారి గెలవాలని అవంతి అనుకుంటున్నారు. దానికి తగిన విధంగా వ్యూహరచనను కూడా ఆయన సిద్ధం చేసుకుంటున్నారు.

విశాఖ జిల్లా మొత్తానికి మంత్రిగా ఉన్న అవంతి అభివృద్ధి కార్యక్రమాలను మాత్రం తన సొంత నియోజకవర్గంలోనే ఎక్కువగా చేసుకుంటున్నారు. ఇక జీవీఎంసీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున  నిధులు కేటాయిస్తే అందులో అధిక భాగం నిధులను  భీమిలీలోని పలు  కార్యక్రమాలను మంత్రి చేపట్టారని విపక్షాలు విమర్సిస్తున్నాయి.

దీని మీద జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ అయితే మంత్రి తన సొంత ప్రాంతం అభివృద్ధి మీదనే శ్రద్ధ చూపిస్తున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు. తన వార్డుకు కనీసంగా కూడా నిధులు ఇవ్వలేదని, పక్షపాతం చూపిస్తున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఎక్కడెక్కడి నిధులు, అభివృద్ధి పనులను పోగు పోసి మరీ  భీమిలీలోనే ఎక్కువగా మంత్రి ఖర్చు చేస్తున్నారు అని అంటున్నారు. దానికి కారణం ఆయన 2024 ఎన్నికల వేళ జనాల మెప్పు పొంది గెలవాల్సిన అవసరం ఉంది. అటువైపు చూస్తే ప్రత్యర్ధి పార్టీలు బలంగా  ఉన్నాయి. భీమిలీలో జనసేన స్ట్రాంగ్ గా ఉంది. టీడీపీకి అది కంచుకోట.

ఇక ఆ రెండు పార్టీలు కలిస్తే కనుక వైసీపీకి ఇబ్బందులు తప్పవు. దాంతో అవంతి ఇపుడు అభివృద్ధి నినాదాన్ని అందుకుంటున్నారని అంటున్నారు. మరి జనాలు వచ్చే ఎన్నికల్లో దాన్ని ఎంతవరకూ విశ్వసిస్తారు అన్నది చూడాలి. ఇక పోతే 2019 ఎన్నికల వేళ  రాజకీయంగా అన్నీ సమీకరణలనూ బేరీజు వేసుకుని వైసీపీలోకి దూకి ఏకంగా మినిస్టర్ అయిన అవంతికి 2024  ఎన్నికలు మాత్రం  టఫ్ గానే ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి మంత్రి గారి ముందు జాగ్రత్త చర్యలు ఎంతమేరకు ఫలిస్తాయో.
Tags:    
  • Minister Avanthi Srinivas 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS