• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమరావతి అభివృద్ధికి...

అమరావతి అభివృద్ధికి వైసీపీ ఓకే...?

By - Tupaki Desk
Update: 2022-04-02 10:34 GMT
ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికి వైసీపీ సర్కార్ సుముఖంగా ఉంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హై కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో అమరావతి రాజధాని అభివృద్ధి మరో నాలుగేళ్ల పాటు గడువు కావాలని కోరారు. సీఆర్డీయే చట్టం ప్రకారం చూసుకున్నా 2024 జనవరి వరకూ గడువు ఉందని పేర్కొన్నారు.

దాంతో అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో వైసీపీ ప్రభుత్వాం హై కోర్టు తీర్పునకు కట్టుబడి ఉందని అర్ధమవుతోంది. తమది మూడు రాజధానుల విధానం అని ఆ పార్టీ నేతలు ఒక వైపు చెబుతున్నారు. మరో వైపు చూస్తే అమరావతి రాజధాని విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పు మీద అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. అక్కడ కూడా వైసీపీ నాయకులు తమ స్టాండ్ త్రీ క్యాపిటల్స్ అని చెప్పారు.

దీని మీద సుప్రీం కోర్టుకు వెళ్తారా అని కూడా అంతా అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అప్పీల్ ఆలోచనలు పెట్టుకోదలచుకోలేదు అని అర్ధమవుతోంది. అదే టైం లో అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లుగా కూడా అఫిడవిట్ దాఖలు బట్టి తెలుస్తోంది. అయితే హై కోర్టు తుది తీర్పులో పేర్కొన్న ప్రకారం ఆరు నెలల వ్యవధిలో అన్నీ చేయలేమమి, తమకు గడువు ఇస్తే చేయగలమని మాత్రమే సమీర్ శర్మ ద్వారా చెబుతోంది.

మరి దీన్ని బట్టి చూస్తే అమరావతి అభివృద్ధిని చేసి రాజధానిగా అంగీకరిస్తే మూడు రాజధానుల ప్రితిపాదన కేవలం మాటలకే ఉంటుందా అన్నది చూడాలి. హై కోర్టు తీర్పు ఉండగా మాత్రం మూడు రాజధానుల మీద అడుగు ముందుకు వేయలేని స్థితి. ఆ తీర్పు మీద సుప్రీం కోర్టులో సవాల్ చేస్తేనే వైసీపీ సర్కార్ కి అనుకూలంగా అక్కడ తీర్పు వస్తేనే ముందుకు కదిలే పరిస్థితి ఉంది.

దీని మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ లక్షల కోట్లను ఒకే చోట వెచ్చించి  రాజధాని అభివృద్ధి చేయలేమని చెబుతున్నారు. ఇంకో వైపు కర్నూల్ లో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తమని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అంటున్నారు. వీటిని బట్టి చూస్తూంటే వైసీపీ మూడ్ ఏంటి అన్నది అర్ధం కావడంలేదనే అంటున్నారు. మొత్తానికి అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లు అయింది అంటున్నారు.
Tags:    
  • andhra pradesh 
  • andhra pradesh government 
  • Andhra Pradesh capital 
  • amaravathi 
  • Vizag 
  • Ap High Court 

Similar News

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ వీడియోలకు చెక్.. మెటా కొత్త రూల్స్!

2026-11-18 07:06 GMT

రేవంత్ ను పొడవడానికి ‘కోమటిరెడ్డి’ ఒక్కడు చాలు.. ‘రూ.5వేల’ మంటపెట్టాడు..

2026-11-18 07:05 GMT

అమెరికాలో మరో షాక్.. NSA రహస్య నెట్‌వర్క్ కూడా డౌన్!

2026-11-18 06:51 GMT

ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా.. ‘షాల్ వుయ్ మూవ్?’ అన్న మోదీ!

2026-11-18 06:50 GMT

Copyright @2026

Powered by Blink CMS