ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రశాంత్ కిషోర్ కు ఎందుకు సమాధానం ఇవ్వాలి?

Update: 2020-07-03 07:30 GMT
ప్రశాంత్ కిషోర్... అలియాస్ పీకేం టీం మళ్లీ ఏపీకి వస్తోంది. ఎన్నికలు లేవు కదా ఇప్పుడేం పని ఆలోచించకండి.. జగన్ గెలుపులో తనదైన పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అమలు చేసే పథకాల పర్యవేక్షణ బాధ్యతను కూడా చేపట్టబోతోందట.

ఏపీలో పారదర్శక పాలన అందించడానికి సీఎం జగన్ సంకల్పించారు. దాదాపు 5 లక్షల సచివాలయం, వార్డు వలంటీర్ల జాబులను ఇచ్చాడు. ప్రతీ 50 ఇండ్లకు ఒక వలంటీర్ ను పెట్టి అన్ని డోర్ డెలివరీ చేయాలనే ఉద్దేశంతో జాబ్స్ ఇచ్చాడు. కానీ క్షేత్రస్థాయిలో వలంటీర్స్ సరిగా చేయడం లేదు అని రిపోర్టులు వచ్చాయట.. దీంతో వారిని సరిగా పర్యవేక్షించేందుకు వలంటీర్ల వ్యవస్థ మీద సూపర్ వైస్ చేయాలని తాజాగా ఏపీ ప్రభుత్వం తమను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ను మళ్లీ ఏపీ ప్రభుత్వంలోకి తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.. పీకే టీంకే పథకాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పజెప్ప బోతున్నారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది.

అయితే ఎన్నికల వరకు పీకే ఓకే.. కానీ ప్రభుత్వంలో ఓ ప్రైవేట్ వ్యక్తికి అధికారం కల్పించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రశాంత్ కిషోర్ కు ఎందుకు సమాధానం ఇవ్వాలని తాజాగా బీజేపీ నేత రఘురామ్ ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నష్టమని.. ఉద్యోగులు ఇబ్బంది పడుతారని.. దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చాడు.

నిజానికి ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ఒక ప్రైవేటు ఏజెన్సీకి ఎందుకు రిపోర్ట్ చేయాలన్నది ఇక్కడ అసలు ప్రశ్న. ప్రభుత్వ వ్యవస్థలో ప్రైవేట్ ఏజెన్సీలకు ఏం పని అని ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోందట.. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొస్తున్న పీకే టీంతో అంతిమంగా ఉద్యోగుల్లో వ్యతిరేకతకు కారణమవుతోందన్న ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది.
Tags:    

Similar News