జగన్ గేర్ మారుస్తున్నారా... ?

Update: 2022-03-23 01:30 GMT
ఏపీ సీఎం జగన్ జోరు పెంచుతున్నారా. గేర్ మారుస్తున్నారా అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలు అదే నిజం అంటున్నాయి. నిజానికి జగన్ ఈ మధ్య దాకా ఫుల్ సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. ఆయన మనసులో ఏముందో తెలుసుకుని మంత్రులు ఇతర సీనియర్ నేతలే విపక్షాలను చీల్చి చెండాడాయి. ఒక్కోసారి అవి వివాదాలకు కూడా దారితీశాయి. అయినా సరే వైసీపీ పొలిటికల్ ఫోకస్ ఏంటి అన్నది మంత్రులు చెబుతూ వచ్చారు.

అయితే మూడేళ్ళ కాలం సమీపిస్తున్న వేళ ఈ డోస్ సరిపోదని జగన్ అంచనాకు వచ్చినట్లుగా ఉన్నారు. అదే టైం లో మౌనంగా ఉంటే అదే దెబ్బ తీసే చాన్స్ ఉందని కూడా భావించారేమో. అందుకే వీలు దొరికితే చాలు తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ బిగ్ సౌండ్ చేస్తున్నారు.

బడ్జెట్ సమావేశాలో ఇలా చాలా సార్లు జగన్ చంద్రబాబు మీద గట్టిగానే సెటైర్లు వేశారు. పంచ్ డైలాగులు పేల్చారు. లేటెస్ట్ గా పోలవరం ఇష్యూ మీద అసెంబ్లీలో చర్చ జరిగినపుడు కూడా ఆయన తన మనసులోని దాన్ని దాచుకోలేక బాబును కుప్పంతో సహా ఈసారి ఓడించి తీరుతామని బిగ్ చాలేంజ్ చేశారు.

దీనికి ముందు కూడా వైసీఎల్పీ సమావేశంలో జగన్ చంద్రబాబుని నథింగ్ అని చెప్పడం ద్వారా ఆయన ఇగోను తట్టిలేపాలని చూశారని చెబుతారు. మొత్తానికి బాబు నథింగ్ అంటూనే అంతా ఆయనతోనే అన్నట్లుగా వైసీపీ రాజకీయం తిరుగుతోంది.

ఇక్కడ ఒక విషయం సుస్పష్టం. ఏపీలో రాజకీయం మారుతోంది. మూడేళ్ళ టైం తరువాత సొంత పార్టీలోనూ కట్టు బాట్లను ఖాతరు చేసేవారు తగ్గుతారు. మరో వైపు అధికార వర్గాలలో చూసినా మునుపటి విధంగా పరిస్థితి ఉండదు. ఎన్నికల గాలి వీచేకొద్దీ అధికారం అన్నది తగ్గిపోతూ ఉంటుంది.

అదే సమయంలో ప్రత్యర్ధులకు హుషార్ వస్తుంది. పవన్ ఆవిర్భావ సభలో ఫుల్ రీచార్జి అయి కనిపించారు. వచ్చేది మేమీ అని బల్లగుద్దారు. చంద్రబాబు మహానాడు బకాయి ఉండనే ఉంది. ఈ పరిస్థితులలో సొంత పార్టీలో నిశ్శబ్దం, విపక్ష శిబిరంలో సందడి సహజంగానే పొలిటికల్ ట్రెండ్ ని చూపిస్తాయి. దాంతో జగన్ ఇక తన మౌనం వీడారు అని అంటున్నారు.

ఆయన గతంలో చంద్రబాబు పేరు ఎత్తడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు, కానీ ఈ మధ్య జగనన్న విద్యా దీవెనలో గతానికి భిన్నంగా ఎక్కువ సేపు మాట్లాడారు. తాము ఏం చేశామో చెప్పుకున్నారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని పదే పదే అంటూ వచ్చారు.

ఒక విధంగా విపక్షం ఏపీలో ఏం సాధించింది అంటే అధికార పక్షాన్ని ఎన్నికల మూడ్ లోకి తెచ్చింది. అదే టైం లో సెల్ఫ్ డిఫెన్స్ లో పడేలా చేసింది. తాము జోరు చేయకపోఏ కుదిరే పరిస్థితి లేదు అని జగన్ భావిస్తున్నారు అంటే ఏపీలో ముందు ముందు టఫ్ ఫైట్ నడిచే సీనే కనిపిస్తోంది. చూడాలి ఆ ముచ్చట ఏంటో.
Tags:    

Similar News