మూడు రాజధానులపైన కుండబద్ధలు కొట్టిన జగన్... ?
మూడు రాజధానుల ఇష్యూ ఏపీలో గత రెండేళ్ళుగా సాగుతోంది. మూడు రాజధానులు ఉండాలా. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలా అన్న విషయం మీద జనాభిప్రాయం అన్నది తెలియకపోయినా రాజకీయ పార్టీల మధ్య మాత్రం చిచ్చు రాజుకుంటూనే ఉంది.
మొత్తానికి మూడు కాదు ఒకటే అని హై కోర్టు తుది తీర్పు తరువాత క్లారిటీ వచ్చినా వైసీపీ మాత్రం మూడు ముద్దు అంటోంది. దీని మీద నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగమ్నోహనరెడ్డి అయితే పక్కా క్లారిటీతో ఉన్న విషయం చెప్పేశారు.
వికేంద్రీకరణ మా విధానం అని అన్నారు. ఈ విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మరెన్ని ఇబ్బందులు వచ్చినా కూదా ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అందరి గౌరవం అన్నదే తమ విధానం అని జగన్ కుండబద్ధలు కొట్టారు.
ఇకవికేంద్రీకరణ బాటలో సాగడం తప్ప మరో మార్గమే లేదని కూడా చెప్పుకొచ్చారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపాడుతామని చెబుతూనే అదే సమయంలో కేవలం అక్కడే 10. 9 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన రాష్ట్రం పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు.
అంటే అమరావతిని చంద్రబాబు బ్లూ ప్రింట్ మేరకు అభివృద్ధి చేయమని జగన్ పేర్కొన్నారు అన్న మాట. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాము, వాటితో పాటే అమరావతిని కూడా అని జగన్ క్లారిటీ ఇచ్చినట్లు అయిందని అంటున్నారు. మొత్తానికి మూడు రాజధానుల విషయంలో తగ్గేదే లే అని జగన్ అన్నారనుకోవాలి. అదే టైం లో మూడు ఎపుడు ఎలా అన్నది వైసీపీ పెద్దల ఆలోచనలను బట్టే చూడాలి.