కాంగ్రెస్ కు ఇంతకు మించిన అవమానం ఇంకొకటి ఉండదేమో?
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కలిసి రావటం లేదు. మోడీ ఎంట్రీ తర్వాత నుంచి ఆ పార్టీ ఎప్పుడూ లేనంత దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. రోజులు గడిచే కొద్దీ.. ఆ పార్టీ ఇమేజ్ తగ్గిపోవటమే కాదు.. ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన స్థానాలకు.. గెలిచిన స్థానాలకు పోలికే లేదని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. కాంగ్రెస్ కు కేటాయించిన సీట్లలో సగం తీసుకొని ఆర్జేడీ పోటీ చేసినా.. ఫలితం మరోలా ఉందన్న వాదన వినిపిస్తోంది.
కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయటం ఏ మాత్రం సరైన వ్యూహం కాదన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. మరో ఏడాదిన్నరలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. యూపీ అసెంబ్లీకి 2022లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తాము జత కట్టబోమని తేల్చేశారు. 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయటం గమనార్హం.
తాజాగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ.. గడిచిన కొద్దిరోజులుగా వివిధ ప్రాంతాల్లోని నేతలతో మాట్లాడామని.. బీజేపీ సర్కారు తీరును తప్పుపట్టారు. అభివృద్ధి పనులు చేపట్టని యూపీ సర్కార్.. కేవలం శిలాఫలకాలు మాత్రమే వేస్తున్నారని విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో కూటమి కట్టదని పేర్కొన్నారు. కేవలం చిన్న పార్టీలతో మాత్రమే కూటమిగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. యూపీ సీఎంగా గతంలో వ్యవహరించిన అఖిలేశ్ నోటి నుంచి వచ్చిన తాజా మాటల కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ గా మారటమే కాదు.. ఇలాంటి పరిస్థితి తమకు వస్తుందన్న విషయాన్ని ఎప్పుడూ ఊహించి ఉండరేమో?