జంబూ ద్వీపంలో మరో అయోధ్య ‘అయుథ్తయ’.. విశేషాలెన్నో

Update: 2020-08-05 10:10 GMT
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేశారు. దేశంలోని ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయి కన్నుల పండువగా వీక్షించారు. ఈ శుభ తరుణంలో మన భారత్ లోనే కాదు.. మరో ప్రాంతంలో కూడా అయోధ్య ఉందనే విషయం తెలుసా? జంబూ ద్వీపంలో ఉన్న ఈ అయోధ్య నగరానికి శతాబ్ధాల  చరిత్ర ఉంది. చాలామందికి తెలియని ఈ జంబూ ద్వీపం చరిత్ర ఇంకా చరిత్ర పుటల్లో నిక్షేపంగా ఉంది.

ఉత్తరప్రదేశ్ కు 3500 కి.మీల దూరంలో థాయ్ లాండ్ దేశంలో మరో అయోధ్య ఉంది. దీన్ని రెండో అయోధ్య అంటారు. బ్యాంకాక్ కు  ఏడు కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.

థాయ్ లాండ్ లోని ఈ అయోధ్యను ‘అయుథ్తయ’ అని అంటారు. థాయ్ లాండ్ ప్రాచీన రాజధాని పేరు ‘అయుథ్తయ’. భారత్ లో మొఘలాయల పాలన ప్రారంభం కాకముందే థాయ్ లాండ్ లో హిందూ రాజ్యంలో రాముడిని పూజించేవారు.  800 ఏళ్ల నాటి బ్యాంకాక్ లో ఉన్న అయోధ్యకు చరిత్ర ఉంది.  భారత్, థాయ్ లాండ్ మధ్య సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నాయి.  

బ్యాంకాక్ లో అయోధ్యను పరిపాలించిన రామా1 అనే రాజు 50వేలకు పైగా పద్యాలతో రామాయణాన్ని రాశాడు. రామా పేరుతో ఉండే రాజులే ఈ అయోధ్య రామాలయాన్ని థాయ్ లాండ్ లో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ప్రధాని మోడీ కూడా థాయ్ లాండ్ పర్యటనలో దీన్ని దర్శించుకొని భారత చరిత్రను వివరించారు. 
Tags:    

Similar News