అమెజాన్ ‘‘సంతృప్తి’’ పాలసీ మారిపోయింది

Update: 2016-02-09 22:30 GMT
అనతికాలంలో అందరి మనసుల్ని దోచుకున్న ఈకామర్స్ లో అమెజాన్ తన సత్తా చాటటమే కాదు.. కోట్లాది భారతీయుల మనసుల్ని దోచుకున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ ద్వారా కొనుగోలు చేసే వస్తువులకు సంబంధించి వినియోగదారులకు ఇప్పటివరకూ ఉన్నఒక పెద్ద సౌలభ్యాన్ని మారుస్తూ అమెజాన్ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇప్పటివరకూ అమెజాన్ వద్ద కొన్న వస్తువుల్ని డెలివరీ తీసుకున్నాక.. సదరు వస్తువు వినియోగదారుడ్ని సంతృప్తి పర్చని పక్షంలో రిటన్ చేసే సౌకర్యం ఉండేది. దీనికి సంబంధించిన పాలసీని మారుస్తూ కంపెనీ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఇకపై.. వస్తువుకు సంబంధించిన పూర్తి సమాచారం వేరే పేజీలో ఉంటుందని.. దాన్ని చూసుకొన్న తర్వాతే సదరు వస్తువును కొనుగోలు చేయాలని.. ఒకవేళ డెలివరీ చేసిన తర్వాత వస్తువు డ్యామేజ్ అయినా.. కొన్న వస్తువుకు బదులుగా వేరే వస్తువు వస్తే మాత్రమే రిటర్న్ చేసే వెసులుబాటు ఉంటుంది. అందుకు మినహా మరి వేటికి రిటర్న్ చేసే అవకాశం ఉండదు. ఈ నిర్ణయం ఫిబ్రవరి 7 నుంచి అమల్లోకి తెచ్చినట్లుగా అమెజాన్ పేర్కొంది. సో.. గతంలోమాదిరి ‘‘సంతృప్తి’’ అంశాన్ని పరిగణలోకి తీసుకొని వస్తువుల్ని కొనుగోళ్లు చేసే వారు జర జాగ్రత్తగా ఉండాలి సుమా.
Tags:    

Similar News