మొన్న అఖిలప్రియ భర్త..నేడు అత్తామామ అజ్ఞాతంలోకి..

Update: 2021-01-11 10:20 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నా టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్ కాగా.. ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలో ఉన్నారు. పోలీసులు ఆయన కోసం గాలిస్తూనే ఉన్నారు.

తాజాగా అఖిలప్రియ అత్తామామ.. భార్గవ్ రామ్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం కలకలం రేపింది. ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించినప్పటికీ  వారి కళ్లు గప్పి తప్పించుకున్నారు.

భార్గవ్ రామ్ కాల్ డేటా, సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా తొలుత బెంగళూరు వెళ్లి అనంతరం మైసూరుకు వెళ్లినట్లు గుర్తించారు. తాజాగా మహారాష్ట్రకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫూణేలో భార్గవ్ రామ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ లభించినట్లు తెలుస్తోంది. రోజులు గడిచినా భార్గవ్ రామ్ ఆచూకీ తెలియకుండా పోవడంతో ఆయన తండ్రిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే చాకచక్యంగా పారిపోయినట్లు సమాచారం.

 స్పెషల్ పోలీసులు ఇంటికి రావడంతోనే చాకచక్యంగా భార్గవ్ రామ్ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అరెస్ట్ భయంతోనే వారంతా పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా భార్గవ్ రామ్ ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు.
Tags:    

Similar News