• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ‘జ్ఞానవాపి’ అప్డేట్: లీకు...

‘జ్ఞానవాపి’ అప్డేట్: లీకు ఆరోపణలతో వేటు.. ఫిర్యాదు చేసినోడికి పట్టం

By - Tupaki Desk
Update: 2022-05-18 03:32 GMT
సున్నితమైన అంశాల విషయంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న వారు ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. చిన్న తప్పు జరిగినా దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. తాజాగా అలాంటిదే జరిగింది. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ‘జ్ఞానవాపి’ మసీదు వివాదానికి సంబంధించి తాజాగా అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రాపై వేటు పడింది. ఆయన స్థానంలో ఆరోపణలు చేసిన వారికే పట్టం కట్టటం విశేషం.

వారణాసిలోని ‘జ్ఞానవాపి’ మసీదు ప్రాంగణంలో శివలింగం ఉందని హిందూ వర్గాలు.. కాదని మసీద్ కమిటీ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు ఒక వీడియో గ్రాఫర్ తో మసీదు ప్రాంగణాన్ని వీడియో షూట్ చేయాలని ఆదేశించటం తెలిసిందే. వీడియో షూట్ అనంతరం.. కొలనులో శివలింగం ఉందంటూ కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లుగా మీడియాలో లీకు కావటం.. అది కాస్తా పెను సంచలనంగా మారటం తెలిసిందే. కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఒక ‘అబ్జెక్టివ్’ ఉందని పేర్కొన్నారని.. కానీ ప్రచారంలోకి మాత్రం శివలింగం ఉందన్న వార్తలు జోరుగా వచ్చాయి.

అత్యంత రహస్యంగా ఉండాల్సిన నివేదిక మీడియాకు ఎలా పొక్కిందన్న ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలో సర్వే కోసం నియమించిన కమిటీకి కీలక బాధ్యతలు పోషిస్తున్న అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రాపై వేటు వేస్తూ వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో విశాల్ సింగ్ ను అడ్వొకేట్ కమిషనర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటే.. సర్వే గురించి సమాచారాన్ని అజయ్ మిశ్రా లీకు చేశారంటూ కంప్లైంట్ చేసిన విశాల్ సింగ్ నే కొత్త అడ్వొకేట్ కమిషనర్ గా నియమించటం గమనార్హం. ఫిర్యాదు చేసిన వ్యక్తికే పట్టం కట్టాన్ని అజయ్ మిశ్రా ప్రశ్నిస్తున్నారు.

తనపై వేటు వేసిన వైనంపై స్పందించిన అజయ్ మిశ్రా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనను మోసం చేశారని వాపోతున్నారు. విశాల్ సింగ్ మోసం చేశాడని.. ఇతరులను నమ్మే తన స్వభావం తన కొంప ముంచినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అర్థరాత్రి 12 దాకా నివేదికను తాము రూపొందించామని.. విశాల్ చేసే కుట్రను తాను కనిపెట్టలేకపోయినట్లుగా చెప్పారు.

చాలా బాధగా అనిపించిందని.. సర్వే గురించి తాను ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదన్న అజయ్ మిశ్రా.. ఆయనో వీడియో గ్రాఫర్ ను నియమించుకొని.. అతని ద్వారా మీడియాకులీకులు ఇచ్చారని.. పుకార్లను ప్రచారం చేసి తనపై వేటు పడేలా చేశారన్నారు. తాను బాధ్యతగా నివేదికను సమర్పించినట్లుగా పేర్కొన్నారు. వీడియో గ్రాఫర్ చేసిన తప్పిదానికి తానేం చేస్తానని ప్రశ్నిస్తున్నారు అజయ్ మిశ్రా.

అయితే.. సున్నితమైన అంశానికి సంబంధించిన బాధ్యతను అప్పగించిన వేళలో.. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో జరిగే తప్పులకు తాను బాధ్యత వహిస్తానన్న విషయంలో అజయ్ మిశ్రా తనది తప్పు లేదని వాదించినా అర్థం లేదు. ఏమైనా తప్పు జరిగిందంటూ అజయ్ మిశ్రాపై వేటు పడటం ఒక ఎత్తు అయితే.. ఆ తప్పు జరిగిందని ఫిర్యాదు చేసిన విశాల్ సింగ్ నే ఆయన స్థానంలో నియమించటం ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలెట్ అంశంగా వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    
  • AjayMishra 
  • Gyanvapi 
  • case 
  • court 
  • tupakinews 
  • telugunews 
  • latestnews 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS