• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రాణాలు కాపాడిన స్మార్ట్...

ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్.. ఎలాగో తెలిస్తే మైండ్ బ్లాంక్

By - Tupaki Desk
Update: 2022-09-13 10:01 GMT
స్మార్ట్ వాచ్..ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. వాచ్ ప్రాణాలు కాపాడమేంటని ఆశ్చర్యపోకండి. ఇది నిజంగానే అద్భుతంగా సాధ్యమైంది. యూకేకు చెందిన ఓ వ్యక్తికి పుట్టినరోజు సందర్భంగా అతడి భార్య యాపిల్ స్మార్ట్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. అది మణికట్టుకు పెట్టుకోగానే పల్స్ రేట్ 30గా చూపించింది. సాధారణంగా ఆ వయసులో పురుషుల హృదయ స్పందనలు నిమిషానికి 100 చొప్పున ఉండాలి. కానీ అతడి కేవలం 30 మాత్రమే నమోదవుతుండడంతో వాచ్ అనుమానించిన భార్య హాస్పటల్ కు తీసుకెళ్లింది.

యూకే చెందిన డేవిడ్ (54)కు అతడి భార్య గిఫ్టుగా ఇచ్చిన స్మార్ట్ వాచ్లో పల్స్ రేట్ 30గా చూపించగా.. వాచ్ పనిచేయడం లేదని అతడు భావించాడు. కానీ భార్య అనుమానించి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. టెస్టులు చేసి గుండెలో పలు బ్లాక్స్ ఉన్నట్టు గుర్తించారు. ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తే అతను కార్డియాక్ అరెస్ట్ తో మృతిచెందే అవకాశం ఉందని డాక్టర్లు తేల్చారు.

ఈ క్రమంలోనే అబ్జర్వేషన్ లో డేవిడ్ నిద్రిస్తున్న సమయంలో 48 గంటల్లో 138 సార్లు పదేసి సెకన్ల పాటు అతడి గుండె పనిచేయడం మానేసింది. డేవిడ్ నిద్రిస్తున్న సమయంలో ఇలా జరిగిందట.. అంతేకాదు.. అది ఆగిపోయినప్పుడు అతడి గుండెలోని మరో భాగం రక్త ప్రవాహాన్ని కిక్ స్టార్ట్ చేసిందన్నమాట.. గుండె సంబంధిత జబ్బు లక్షణాలు కనిపించకపోవడం.. అతడు ఆరోగ్యంగా ఉండడం చూసి డాక్టర్లు సైతం ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

చివరకు సర్జరీతో గుండెలోని  ఆ బ్లాక్స్ తొలగించి అతడి ప్రాణాలు డాక్టర్లు కాపాడారు. అలాగే భవిష్యత్తులో అతడి హృదయ స్పందనల్లో ఏమైనా తేడాలు సంభవిస్తే ముందుగానే పసిగట్టేందుకు.. గుండె కవాటాలు సమన్వయంతో పనిచేసేలా గుండెలో ఒక 'పేస్ మేకర్' పరికరాన్ని సైతం అమర్చారు. ఇప్పుడు అతడి గుండె పనితీరు మెరుగుపడింది.

'నా భార్య నాకు స్మార్ట్ వాచ్ ను బహుమతిగా ఇచ్చి ఉండకపోతే నా సమస్య బయటపడేది కాదు.. నేను బతికి ఉండేవాడిని కాదు.. నేను ఎప్పటికీ ఆమెకు రుణపడి ఉంటాను. ఒక్క ఛార్జింగ్ సమయంలో తప్ప ఆ వాచ్ ఎప్పుడూ నా చేతికే ఉంటుంది' అని డేవిడ్ చెబుతున్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • AppleWatch 
  • Hearrate 
  • David 
  • Hospital 
  • Birthday 
  • Gift 
  • UnitedKingdom 
  • SmartWatch 
  • CardiacArrest 
  • TupakiNews 

Similar News

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS