అమరావతిలో కట్టే ఫస్ట్ బిల్డింగ్ ఎక్కడ..?

Update: 2015-11-28 04:42 GMT
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దసరా రోజున జరిగిన ఈ కార్యక్రమం పూర్తి అయి దాదాపుగా నెలకు పైనే అవుతుంది. శంకుస్థాపన పూర్తి అయిన తర్వాత నిర్మాణ పనులు వెనువెంటనే స్టార్ట్ అవుతాయని అనుకున్నా.. అలాంటిది ఏమీ కనిపించని పరిస్థితి. అమరావతిలో నిర్మించే మొదటి కట్టటం ఏమిటి? అదెక్కడ ఉంటుంది? దాన్ని ఎవరి కోసం నిర్మించనున్నారన్న విషయానికి సంబంధించిన స్పష్టం కాస్త వచ్చింది.

అమరావతిలో నిర్మించే తొలి కట్టడం 40 అంతస్తుల భవనంగా చెబుతున్నారు. రాజధానికి సంబంధించి మొట్టమొదట జరిపే నిర్మాణం ఇదేనని తేల్చి చెబుతున్నారు. లింగాయపాలెం వద్ద దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే 40 అంతస్థుల భవనమే మొదటి భవనం అవుతుంది.

పూర్తి గ్రీన్ బిల్డింగ్ అయిన ఈ భవనంలోనే సచివాలయం దగ్గర నుంచి సీఎం కార్యాలయం వరకూ ఉంటాయని చెబుతున్నారు. ఈ భారీ భవనంలో దాదాపుగా 40వేల మంది పని చేసేందుకు వీలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తి అయితే దాదాపుగా 44లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చే వీలుంది. సచివాలయంతో పాటు.. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఈ భారీ భవనంలో ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం 40వ అంతస్థులో ఏర్పాటు చేస్తారు.

ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రమే కాదు.. సీఎం అనుబంధ అధికారుల కార్యాలయాలతో పాటు.. వివిధ శాఖ మంత్రులు.. అధికారులు అంతా ఒకేచోట ఉండేలా దీన్ని డిజైన్ చేయనున్నారు. మరి.. ఇంత భారీ భవనానికి ఎంత ఖర్చు అవుతుందన్న లెక్కను కూడా వేసేశారు. 40 అంతస్థుల ఈ భవనానికి రూ.3వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. మరి.. ఇంత భారీ భవన నిర్మాణానికి ఎంత కాలం పడుతుంది..? 2019 ఎన్నికలకు ముందే పూర్తి చేస్తారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
Tags:    

Similar News