మూడేళ్లు ఉండొచ్చు.. విదేశీయులకు ద్వారాలు తెరిచిన రష్యా

ఓవైపు కఠిన వీసా నిబంధనలతో అమెరికా పొమ్మంటోంది. కానీ ఇదే సమయంలో మరో అగ్రరాజ్యం రష్యా మూడేళ్ల తాత్కాలిక శాశ్వత నివాసం ప్రతిపాదికన విదేశీయులకు స్వాగతం పలుకుతోంది.;

Update: 2025-12-09 10:45 GMT

ఓవైపు కఠిన వీసా నిబంధనలతో అమెరికా పొమ్మంటోంది. కానీ ఇదే సమయంలో మరో అగ్రరాజ్యం రష్యా మూడేళ్ల తాత్కాలిక శాశ్వత నివాసం ప్రతిపాదికన విదేశీయులకు స్వాగతం పలుకుతోంది. విదేశీ వృత్తి నిపుణులను ఆకర్షించడానికి భారత్-రష్యా మొబిలిటీ ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి రష్యా ప్రభుత్వం ఓ సరికొత్త వీసా కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కొత్త వీసా కింద అర్హత గల నిపుణులకు ఆ దేశంలో మూడేళ్ల పాటు తాత్కాలిక లేదా శాశ్వత నివాసం పొందే అవకాశం లభిస్తోంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ కొత్త వీసా కార్యక్రమం వచ్చే ఏడాది ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వీసాలను సైన్స్, ఆర్థిక, పారిశ్రామిక, విద్యా, సాంస్కృతిక , వ్యాపార , క్రీడలు వంటి పలు కీలక రంగాల్లోని నిపుణులైన విదేశీయులకు వారి కుటుంబసభ్యులకు జారీ చేస్తారు.

ఈ వీసా వల్ల అర్హులైన నిపుణులు రష్యాలో మూడేళ్లపాటు తాత్కాలిక లేదా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వలస కోటాతో సంబంధం లేకుండా రష్యా భాషకు సంబంధించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోయినా తాత్కాలిక నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తారు. ప్రధాన దరఖాస్తుదారుతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

అభ్యర్థులు ముందుగా ఏజెన్సీల్లో వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే అర్హులో కాదో అధికారులు గుర్తించి ఏజెన్సీ ల ద్వారా ఒక సంవత్సరం పాటు వీసా చెల్లుబాటు అయ్యేలా ఇస్తారు. అర్హులుగా నిర్ణయించిన వారికి మూడేల్లపాటు రష్యాలో తాత్కాలిక, లేదా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. స్వదేశాల్లో ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఏజెన్సీలో దరఖాస్తులు సమర్పించి ఆమోదం పొందిన తర్వాత రష్యాలోకి వచ్చేందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు సంవత్సరం బిజినెస్ వీసా మంజూరు చేస్తారు. ఈ క్రమంలోనే వారు కొత్త వీసా దరఖాస్తు కార్యక్రమానికి దరఖాస్తు సమర్పించాలి.

తాత్కాలిక లేదా శాశ్వత నివాసం కోసం అభ్యర్థుల దరఖాస్తుపెండింగ్ లో ఉన్నట్లయితే అలాంటి విదేశీయులకు, వారి కుటుంబ సభ్యులకు వర్క్ పర్మిట్ పొందేందుకు అర్హులుగా గుర్తిస్తారు. ఈ దరఖాస్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు కేవలం 30 రోజుల్లోపే ప్రాసెస్ చేస్తారు.

ఈ కొత్త వీసా కార్యక్రమం రష్యాకు అంతర్జాతీయ నైపుణ్యాన్ని ఆకర్షించడంలో , కీలక రంగాల్లో వృద్ధిని సాధించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News