సుత్తితో కొట్టి తండ్రిని చంపాడు.. అడిగితే అది తన బాధ్యత అంటున్నాడు!

అవును... ఇల్లినాయిస్ లోని షాంబర్గ్ లో వారి ఇంట్లోనే తన తండ్రిని పెద్ద సుత్తితో కొట్టి చంపాడు కుమారుడు.;

Update: 2025-12-17 09:56 GMT

67ఏళ్ల తన తండ్రిని సుత్తితో తలపై బలంగా కొట్టాడు 28 ఏళ్ల అతని కుమారుడు. దీంతో ఆ తండ్రి ముక్కు పగిలిపోవడంతో పాటు ఏకంగా పుర్రె బద్ధలైపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం.. తండ్రి మృతదేహాన్ని తీసుకొచ్చి గ్యారేజ్ లో పడేశాడు కుమారుడు. పైగా వాళ్ల అమ్మ ఫోన్ చేస్తే.. నాన్నను జాగ్రత్తగా చూసుకున్నాను అని చెప్పాడు.

అవును... ఇల్లినాయిస్ లోని షాంబర్గ్ లో వారి ఇంట్లోనే తన తండ్రిని పెద్ద సుత్తితో కొట్టి చంపాడు కుమారుడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ భారత సంతతి వ్యక్తిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. తన తండ్రిని చంపిన అనంతరం తన తల్లి ఫోన్ చేస్తే... నాన్నను జాగ్రత్తగా చూసుకున్నాను అని చెప్పాడు. పోలీసులు అడిగితే.. అతన్ని చంపడం తన మతపరమైన బాధ్యత అని చెబుతున్నాడు.

వివరాళ్లోకి వెళ్తే... హత్య జరిగిన రోజు (నవంబర్ 29) అనుపమ్ పటేల్ (68) భార్య ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్లింది. భర్తకు డయాబెటిస్ కారణంగా ఆమె జాబ్ కి వెళ్తోంది. అతని గ్లూకోజ్ మీటర్ అతని భార్య ఫోన్ కు అనుసంధానించబడి ఉంది. సాధారణంగా అనుపమ్ పటేల్ నిద్ర లేచిన తర్వాత ఉదయం 8 గంటల ప్రాంతంలో కచ్చితంగా తన భార్యకు ఫోన్ చేస్తాడు.

కానీ.. ఆరోజు ఆమెకు ఫోన్ చేయలేదు. మరోవైపు అతని గ్లూకోజ్ స్థాయిలు పడిపోతున్నట్లు ఫోన్ లో చూపిస్తోంది. దీంతో.. ఆమె ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో తన భర్త, కొడుకుని ఫోన్ ద్వారా సంప్రదించడంలో విఫలమైంది. రెగ్యులర్ గా ఉదయం 8 గంటలకు తన గ్లూకోజ్ స్థాయిల గురించి చెప్పడానికి ఫోన్ చేసే భర్త నుంచి కాల్ రాకపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది.

ఈ నేపథ్యంలో ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో గ్యారేజ్ తలుపు అసాధారణంగా తెరిచి ఉండటన్ని గమనించింది. మరోవైపు.. ఆమెకు ఎదురొచ్చిన కుమారుడు.. నాన్నను జాగ్రత్తగా చూసుకున్నాను అని చెప్పాడు. ఆమె మనసు ఏదో కీడు సంకించిందో ఏమో.. హుటాహుటన తన బెడ్ రూం లోకి వెళ్లి చూసింది.. భర్త రక్తంతో మంచం మీద పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యింది.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు అత్యవసర సిబ్బంది అక్కడకి చేరుకున్నారు.. అప్పటికే అనుపమ్ పటేల్ మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో ఓ పెద్ద సుత్తిని కనుగొన్నారు. పోస్టుమార్టంలో మృతుడి తలపై కనీసం రెండు దెబ్బలు తగిలాయని.. ఫలితంగా అతని పుర్రె పగిలిపోయిందని.. మరో వైపు ముక్కు విరిగిపోయిందని నిర్ధారించారు.

అనంతరం.. అభిజిత్ పటేల్ పోలీసులకు లొంగిపోయాడు. విచారణ సందర్భంగా... చిన్నప్పుడు తనను తన తండ్రి లైంగికంగా వేధించాడని ఆరోపించాడు.. ఈ నేపథ్యంలో అతనిని చంపడం తన మతపరమైన బాధ్యత అని తెలిపాడు. తన తండ్రిని సుత్తితో బలంగా కొట్టి, ఆ తర్వాత గది నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపాడు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణ డిసెంబర్ 19న జరగనుంది!

Tags:    

Similar News