వైసీపీలో 'కొత్త' కుంపటి ..!
కొత్తొక వింత.. పాతొక రోత! అనేది సామెత. ఇది రాజకీయాలకు కూడా అన్వయం అవుతుంది. దీనికి ఎవరూ అతీతులుకాదు.;
కొత్తొక వింత.. పాతొక రోత! అనేది సామెత. ఇది రాజకీయాలకు కూడా అన్వయం అవుతుంది. దీనికి ఎవరూ అతీతులుకాదు. ఏ పార్టీలో అయినా.. కొత్తరక్తాన్ని తీసుకువచ్చేందుకు... పాతవారిని పక్కన పెట్టేందు కు నాయకులు ప్రాధాన్యం ఇస్తారు. అయితే.. ఇది అన్నిసార్లూ ప్రయోజనం చేకూరుస్తుందా? అంటే కష్ట మే. చాలా మంది నాయకులను మార్చిన పార్టీలు.. గతంలో విజయం దక్కించుకున్నవీ ఉన్నాయి. అదేసయమంలో పరాజయం మూటగట్టుకున్నవి కూడా ఉన్నాయి.
గతంలో అన్నగారు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలో 75 శాతం మంది కొత్త వారికి ప్రాధాన్యం ఇ చ్చారు. కాంగ్రెస్‌నేతలను ఒకరిద్దరిని తీసుకున్నా.. మెజారిటీగా కొత్తవారినే తీసుకున్నారు. అయితే.. అప్ప టి హవాలో వారు విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం కూడా అదే పార్టీలో కొనసాగుతున్నారు. మరికొం దరు దూరమయ్యారు. కానీ.. కొత్తవారైనా.. పాతవారైనా.. రాజకీయాల్లో ఇమడాలంటే.. వ్యూహం, చతురత, ఎత్తుకు పైఎత్తు వేసే లక్షణం ఉండాలి. అప్పుడు మాత్రమే పుంజుకుంటారు.
ఈ పరంగా చూసుకుంటే.. వైసీపీ చేసిన `కొత్త` ప్రయోగం వికటించింది. పాత వారిపై ప్రజలు విరక్తి చెందా రని.. కొత్త ముఖాలను ఆదరిస్తారని అంచనా వేసుకున్న వైసీపీ అధినేత జగన్.. గత ఎన్నికల్లో చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అసలు అప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేని వారిని తీసుకువచ్చారు. వారికి నేరుగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేశారు. ఇది విజయం దక్కించుకుంటుందని అనుకున్నారు. కానీ, వికటించింది. అంతేకాదు.. ఇప్పుడు పార్టీ తరఫు గళం వినిపించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్తితిని కల్పించింది.
ఉదాహరణకు..విజయవాడ వెస్ట్‌లో ఆటో నడుపుకొనే షేక్ ఆసిఫ్‌ను తెచ్చి టికెట్ ఇచ్చారు. ఆయనకు అన్నీ సమకూర్చారు. కానీ, పరాజయం పాలయ్యారు. ఇక, అనంతపురం జిల్లా మడకశిరలో లక్కప్పకు అవకాశం ఇచ్చారు. ఈయన లారీ డ్రైవర్. ఆర్థికంగా జీరో. అయినా.. గెలిపిస్తానన్నారు. కానీ, ఓటమి మూటగట్టుకున్నారు. మైలవరంలోనూ సర్నాల తిరుపతి రావు అనే కొత్త ముఖానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం వీరేమైనా పార్టీ తరఫున ఓ లక్ష రూపాయలు ఖర్చు చేయగలరా? అంటే అది కూడా లేదు. పోనీ.. వీరిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తారా? అంటే.. అది కూడా చేయడం లేదు. మొత్తంగా వైసీపీలో ఈ కొత్త కుంపటి వ్యవహారం రాను రాను ముదురుతోంది. ఇలాంటి ప్రయోగాలు వద్దని ఆనాడే చెప్పామంటూ.. సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎటూ తేలక పోవడం గమనార్హం.