గోదావరిలో డెడ్లీ కాంబో...చాన్స్ కోసం వైసీపీ మంత్రాంగం

ఎక్కడ పోగోట్టుకున్నామో అక్కడే వెతుక్కోవడం అన్నది రాజకీయ పార్టీలకు చాలా అవసరం లేకపోతే విజయానికి దగ్గర దారులు కనిపించవు.;

Update: 2025-06-03 17:40 GMT

ఎక్కడ పోగోట్టుకున్నామో అక్కడే వెతుక్కోవడం అన్నది రాజకీయ పార్టీలకు చాలా అవసరం లేకపోతే విజయానికి దగ్గర దారులు కనిపించవు. వైసీపీకి తాను పోగొట్టుకున్నదేంటో బాగా అర్ధం అయింది. దాంతో ఇపుడు దానిని తిరిగి తెచ్చుకునే ప్రయత్నమ్న్లో ఉంది.

వైసీపీ భారీ ఓటమి వెనక ఉభయ గోదావరి జిల్లాకు కీలకంగా మారాయి అని అంటున్నారు. అక్కడ ఒక్క సీటు కూడా వైసీపీ గెలవలేదు. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రలో చెప్పినట్లుగా వైసీపీని జీరో చేశారు. మొత్తం 34 అసెంబ్లీ సీట్లు అయిదు ఎంపీ సీట్లు ఇక్కడ ఉంటే వైసీపీ 2024 ఎన్నికల్లో బోణీ కొట్టలేకపోయింది.

దాంతో పాటు టీడీపీ జనసేన డెడ్లీ కాంబోతో గోదావరి జిల్లాలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాయి. ఏడాది గడచినా పరిస్థితిలో అయితే పెద్దగా మార్పు లేదని అంటున్నారు సహజంగా టీడీపీకి గోదావరి జిల్లాలలో మంచి పట్టు ఉంది. కంచుకోటలుగా అనేక నియోజకవర్గాలు టీడీపీ చేతిలో ఉన్నాయి. దానికి తోడు అన్నట్లుగా జనసేన చేరింది. దాంతో ఈ రెండు పార్టీలు కలసి వైసీపీకి బ్రేకులు వేసేసాయి.

ఈ నేపధ్యంలో ఏడాది తరువాత అయినా మార్పు వస్తుందా అని వైసీపీ ఆశలతో ఉంది. గోదావరిలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇక లేటెస్ట్ గా చూస్తే తుని రైలు తగులబెట్టిన కేసులో ముద్రగడ పద్మనాభం ప్రభృతుల మీద కేసులను తిరగగోడాలని రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడం తూచ్ అని ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే కూటమి సర్కార్ దానిని వెనక్కు తీసుకోవడం జరిగిపోయాయి.

అయితే ఈ ఇష్యూని వీలైనంతగా రగిలించే పనిలో రాజకీయ మంత్రాంగంగా వాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది అని అంటున్నారు. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే తూచ్ అని జీవో వెనక్కు తీసుకోవడం కూడా తప్పు పట్టాల్సిందే అన్నారు. కాపులను వాడుకుని వదిలేయడమేనా అని నిలదీశారు. బీసీలలో కాపులను చేరుస్తామని చంద్రబాబు 2014 ఎన్నికల వేళ ఇచ్చీ హామీ ఏమైంది అని ప్రశ్నించారు

ఏ పార్టీలో ఉన్నా కాపులు అంతా ఒక్కటే అని ఆయన అన్నారు. అసలు కాపులు అంటే చంద్రబాబూ ఎందుకు అంత కోపమని అంబటి నిలదీశారు. ముద్రగడ మీద మీద కోపంతో కేసులను తిరగతోడాలని నిర్ణయించుకుంటే తగిన విధంగా స్పందిస్తామని అంబటి అంటున్నారు. ముద్రగడ ఒంటరి కాదని ఆయన స్పష్టం చేశారు.

ముద్రగడతోనే కాపు జాతి మొత్తం ఉందని కూడా అంబటి అనడం విశేషం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే మొత్తం కేసులను ప్రభుత్వం కొట్టేసింది అని ఆయన గుర్తు చేశారు. అలాంటిది ఇపుడు కేసులను తిరగతోడాలని అనుకోవడంలోనే బాబు దురుద్దేశ్యం బయటపడింది అని అంబటి విమర్శించారు.

కేసులను తిరగతోడాలన్నదే తీవ్రమైన అంశమని ఆయన అన్నారు తిరిగి జీవో వెనక్కి తీసుకోవడాన్ని పట్టించుకోమని ఆయన తెగేసి చెప్పారు. తొందరలోనే అన్ని పార్టీలలో ఉన్న కాపులతో కీలకమైన సమావేశం నిర్వహిస్తామని ఆ విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కాపులకు చేస్తున్న అన్యాయం మీద చర్చిస్తామని అంబటి చెప్పుకొచ్చారు.

అసలు జీవో ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. చంద్రబబు హోం మంత్రి అనితకు తెలియకుండా వచ్చిందంటే కూటమి ప్రభుత్వం అసమర్ధత కాదా అని ప్రశ్నించారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారు అని అంబటి బాబుని నిందించారు. జీవో ఎలా వచ్చిందో బాబు విచారణ చేయాలని అంతే కాదు కూటమి ప్రభుత్వం కాపులకు సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే అంబటి లేవనెత్తిన పాయింట్లు చూస్తే కాపులతో మళ్ళీ సమావేశాలు నిర్వహించడం ద్వారా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహించాలని ఆలోచన ఉందని అంటున్నారు. అంతే కాదు కాపు జాతి మొత్తం ముద్రగడ వెంట ఉందని ఆయన చెప్పారు. ముద్రగడ ఇపుడు వైసీపీలో ఉన్నారు. ఆ విధంగా కోస్తా జిల్లాల్లో ప్రత్యేకించి గోదావరి జిల్లాలలో కాపులను పోలరైజ్ చేసి తమ వైపు తిప్పుకునే ఎత్తుగడతో వైసీపీ ఒక రాజకీయ మంత్రాంగం సిద్ధం చేసింది అని అంటున్నారు.

Tags:    

Similar News