త్వరలో మన ప్రభుత్వం వస్తుంది!: జగన్
అయితే.. అప్పటిలోగా.. తాను రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తానని జగన్ రైతులకు హామీ ఇచ్చారు.;
వైసీపీ తరఫున త్వరలోనే రాష్ట్రంలో రైతు ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రకటించారు. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రైతుల సంఘాల నాయకు లతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుల తరఫున పోరాటం చేస్తున్నారంటూ..పలువురు రైతు లు జగన్‌ను శాలువాతో సత్కరించారు. అదేవిధంగా వారి సమస్యలు కూడా చెప్పుకొన్నారు. ముఖ్యంగా తమకు దళారులతో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
గత వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా తమకు మేలు జరిగిందని కొందరు రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని తీసేశారని.. దీంతో దళారుల ప్రమేయం ఎక్కువగా ఉందని తెలి పారు. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో రైతు భరోసా హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు కూటమి ప్రభు త్వం అమలు చేయలేదని మరికొందరు చెప్పారు. అనంతరం జగన్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం త్వరలోనే వస్తుందన్నారు.
అయితే.. అప్పటిలోగా.. తాను రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తానని జగన్ రైతులకు హామీ ఇచ్చారు. తాను గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన తర్వాతే.. అక్కడి రైతులకు మేలు జరిగిందన్నారు. అలాగే.. తాను చిత్తూరులోని మామిడి యార్డుకు వెళ్లాకే.. అక్కడి రైతులకు ధరలు పెంచారని.. రూ.260 కోట్లు కేటా యించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తాను మళ్లీ రైతులకు ఏ కష్టం వచ్చినా బయటకు వస్తానన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతానని చెప్పారు.
ఎంపిక చేసిన వారికే..
కాగా.. తాడేపల్లిలో జగన్‌ను కలుసుకునేందుకు నిజానికి పలు జిల్లాల నుంచి రైతులు వచ్చారు. అయితే.. వీరిలో కొందరు వైసీపీ హయాంలో చేపట్టిన భూముల సర్వేలో భూములు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. దీంతో తమ సమస్యలు చెప్పుకోవాలని భావించారు. అయితే.. తాడేపల్లి వర్గాలు మాత్రం ఎంపిక చేసిన 15-25 మందిలోపు రైతులను మాత్రమే జగన్‌ను కలుసుకునేందుకు అనుమతించారు. అది కూడా.. నాలుగు చోట్ల తనిఖీలు చేశారని రైతులు తెలిపారు.