వైసీపీ బ్యాలెట్ వార్...రివర్స్ గేర్ !

వైసీపీ పొలిటికల్ గా గేర్ మార్చింది. నిన్నటిదాకా సంశయంగా విషయాన్ని ఇపుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా చూస్తోంది.

Update: 2026-10-07 18:09 GMT

వైసీపీ పొలిటికల్ గా గేర్ మార్చింది. నిన్నటిదాకా సంశయంగా విషయాన్ని ఇపుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా చూస్తోంది. ఏపీలో ఎందుకు ఓటమి చెందాం అని వైసీపీ తరచి చూసుకుందో లేదో తెలియదు కానీ ఎక్కువ మంది ఆ పార్టీ నేతలు అయితే ఈవీఎంల మహిమ అంటూ సెటైరికల్ గా మాట్లాడుతూ వచ్చారు. ఇక దానికి ఆధారాలు ఉన్నాయా అంటే కొంతమంది మేధావులు గతంలో మాట్లాడుతూ చివరి నిముషంలో భారీ పోలింగ్ నమోదు అయింది అని అది ఎట్లా అని కూడా ప్రశ్నించారు. వైసీపీ కూడా వాటిని తీసుకుని కొన్నాళ్ళ పాటు విమర్శలు చేసింది. అయితే వాటికి అంత బలం చేకూరిందా అంటే ప్రభావం అయితే అంతగా కనిపించలేదు, ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని మధ్యలో ఆపేసింది. ఇపుడు మాత్రం సడెన్ గా బ్యాలెట్ పేపర్ ముద్దు అని వైసీపీ అంటోంది. దానికి కారణం ఏమిటి అంటే దేశంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలే అన్నది జవాబు.

ఈసీ మీద రచ్చ :

కేంద్ర ఎన్నికల సంఘం తీరు మీద సర్ ప్రక్రియ మీద ఇపుడు దేశంలో రాజకీయ రచ్చ సాగుతోంది. ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు అని ఇండియా కూటమి నుంచి తీవ్ర విమర్శలు గతంలో వచ్చాయి. తాజాగా అవి పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఓట్ల గల్లంతు వెనక కుట్ర ఉందని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో సీఈసీ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ రోడ్డు మీదకు వచ్చింది. జగన్ సైతం ఈసీ పని తీరు మీద కొన్ని హాట్ కామెంట్స్ చేస్తూ ఇటీవల ట్వీట్ చేశారు. ఇపుడు ఆ పార్టీ అయితే ఈవీఎంలు వద్దు బ్యాలెట్‌తోనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది.

బ్యాలెట్ పేపర్ తోనే :

బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు పెట్టేందుకు సిద్ధమా అని మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా డిమాండ్ చేశారు. దేశంలో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలపై వస్తున్న అనుమానాల నేపథ్యంలో ప్రజాస్వామ్య పారదర్శకత కోసం రాబోయే ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సంఘం దీనికి సిద్ధమా అంటూ ఆమె సవాల్ విసిరారు. అయితే ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తులు చేస్తోంది. ఇందుకోసం పొరుగు రాష్ట్రాల నుండి కూడా బ్యాలెట్ బాక్సులను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈసీ ముందు డిమాండ్ :

బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకుని రావాలన్న డిమాండ్ కి జాతీయ స్థాయిలో విపక్షాల మద్దతు పూర్తి స్థాయిలో ప్రకటించాయి. ఇక ఏపీలో చూస్తే వైసీపీ కూడా వారితో గొంతు కలుపుతోంది. దేశవ్యాప్తంగా పలు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈవీఎంల వాడకాన్ని వ్యతిరేకిస్తూ బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకు రావాలని కోరుతున్నాయి. అయితే ఈ తరహా రాజకీయ డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నాయనేది అయితే ఇప్పటిదాకా తెలియదు, ఆ విషయంలో స్పష్ట అంతకంటే లేదు, అయితే ఈ డిమాండ్ ని ఒక ఉద్యమంగా మార్చేందుకు విపక్షాలు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో వైసీపీ కూడా తన గొంతు పెంచింది.

ఏపీలో ఎన్నికల మీద :

ఈ నేపధ్యంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విశాఖ సౌత్ కి చెందిన నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ అయితే 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల తీరు మీద అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం. ఏపీలో 2024 ఎన్నికల సందర్భంగా ఫారం-20 విషయలోనూ అలాగే ఈవీఎం డేటా ధ్వంసంపై తమ పార్టీకే కాదు అందరికీ పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు చివరి నిముషంలో అధిక పోలింగ్ శాతం ఎలా నమోదు అవుతుందని కూడా ఆయన నిలదీస్తున్నారు. అందుకే ఎన్నికల్లో పారదర్శకత ఉండాలీ అంటే ఈవీఎంలను పక్కన పెట్టేసి బ్యాలెట్ పేపర్‌తో ఏ ఎన్నిక అయినా ఇక మీదట నిర్వహించాలని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. దీని మీద తాము జనంతో కలసి ఆందోళనలు నిర్వహిస్తామని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ వైపుగా వైసీపీ టర్నింగ్ ఇచ్చుకుంది అని అంటున్నారు.

Tags:    

Similar News