వామ్మో.. ఇలాంటి రాజకీయం దీదీకే సాధ్యం బాస్

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Update: 2024-05-04 03:45 GMT

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తిరుగులేని అధినేత్రిగా వ్యవహరిస్తూ.. ఏళ్లకు ఏళ్లుగా బెంగాల్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె.. ఆ రాష్ట్రాన్ని డెవలప్ మెంట్ విషయంలో దూసుకెళ్లే కన్నా.. హింసా రాజకీయాల్ని అంతకంతకూ పెంచి పోషించేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శ తరచూ ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్నికలు వస్తే చాలు.. ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆమెకు ఎలాంటి గాయాలు అవుతాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి.

దేశంలో ఇంతటి రివెంజ్ పాలిటిక్స్ మరే రాష్ట్రంలో ఉండవన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సంచలన ఆరోపణ చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రికి.. ఆ రాష్ట్ర గవర్నర్ కు మధ్య సత్ సంబంధాలు లేవన్న విషయం అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ.. గవర్నర్ పై ఆమె షాకింగ్ ఆరోపణలు చేశారు. రాజ్ భవన్ లోని మహిళా ఉద్యోగితో అసభ్యంగా వ్యవహరించారంటూ కొత్త వివాదానికి తెర తీశారు.

బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ పై వస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు. రాజ్ భవన్ లో ఒక మహిళ వేధింపులకు గురి కావటం సిగ్గుచేటుగా అభివర్ణించిన ఆమె.. సదరు మహిళ బయటకు వచ్చి గవర్నర్ కు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. ఆ మహిళ కన్నీళ్లతో తన గుండె పగిలిందన్న ఆమె.. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేరని ప్రశ్నించారు.

Read more!

దీదీ మాటల్లో తప్పేముంది? ఆమె ఒక బాధితురాలి గొంతుకగా మారటాన్ని సమర్థించరా? అని ప్రశ్నించొచ్చు. ఇక్కడే చిన్నలాజిక్ ఉంది. ఆమె గవర్నర్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన వేళలో ఆ అంశం మీదనే నిలబడితే అనుమానించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. దీదీ తన మాటల్లో సందేశ్ ఖలీ అంశాన్ని ప్రస్తావించారు. రాజ్ భవన్ లో గవర్నర్ మీద పెద్ద బండ వేస్తున్న సందర్భంలోనే.. సందేశ్ ఖలీ గురించి మాట్లాడే మోడీ.. గవర్నర్ ఎపిసోడ్ మీద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ సందేశ్ ఖలీ ఉదంతం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. బసీర్ హత్ ఎంపీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రేఖా పాత్రా పోటీ చేస్తున్నారు. ఈ ఎంపీ స్థానం పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మమతమ్మ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఎమ్మెల్యే షేక్ షాజహాన్ తన నియోజకవర్గం పరిధిలోని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం.. దాడులు చేయటం లాంటివి చేస్తుంటారు. దీనిపై రేఖ పాత్ర అనే ఒక నిరుపేదరాలు ప్రశ్నించటం.. భారీ ర్యాలీ నిర్వహించటం.. దీనిపై గవర్నర్, బెంగాల్ రాష్ట్ర హైకోర్టు స్పందించటం తెలిసిందే.

4

ఈ ఉదంతంలోనే సదరు ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ అంశం బెంగాల్ తో పాటు.. దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఎపిసోడ్ తర్వాత సదరు రేఖా పాత్రకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వటమే కాదు.. ఆమె అభ్యర్థిత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా మాట్లాడటం.. ఆమె గెలిపించాలని కోరుతూ సోషల్ మీడియాలో రియాక్టు అయ్యారు. గవర్నర్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన మమత.. సందేశ్ ఖలీ అంశాన్ని ప్రస్తావించటంతో అసలు విషయం ఇట్టే అర్థమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. ఎన్నికల వేళ దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే అధినేతల జాబితాలో మమత బెనర్జీ ముందుంటారన్న మాట తాజా ఎపిసోడ్ తో మరోసారి స్పష్టమైందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News