బాలయ్య చిన్నల్లుడు ఒంటరి!...ఎందుకలా ?

తన సొంత టీం తన గీతం కాంపౌండ్ దాటి బయటకు రాని భరత్ తో సొంత పార్టీ నేతలు మిత్ర పార్టీ నేతలూ దూరం పాటిస్తున్నారు అన్నది తాజా టాక్.

Update: 2024-04-27 06:30 GMT

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు ఆయనకు ఒక ట్యాగ్. విశాఖకు చెందిన మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి రాజకీయ వారసత్వం మరో ట్యాగ్. ఇంకో తాత కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు సైతం కేరాఫ్ గా ఆయనకు ఉంది. ఆయనే శ్రీ భరత్. విశాఖలో గీతం విద్యాసంస్థల అధినేత. భారత్ కి రాజకీయ ఆసక్తి ఉంది. 2019లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఓటమి పాలు అయ్యారు.

ఈసారి ఎలాగైనా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఆయనకు అది ఈసారి కూడా విశాఖ ఎంపీ పదవి అందని పండు అవుతోంది అని అంటున్నారు. దానికి కారణం ఆయన ఎవరినీ నమ్మ కపోవడంతో పార్టీలో ఒంటరి అయ్యారు అని ప్రచారం సాగుతోంది. అలాగే ఆయనకు పార్టీలో మద్దతు కూడా అనుకున్నంతగా దక్కడం లేదు. దాంతో మరోసారి ఓటమి పాలు కాక తప్పదా అన్న కలవరం చెలరేగుతోంది.

భారత్ వి ఒంటెద్దు పోకడలు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయన ఎవరినీ నమ్మకపోతే మేమెందుకు అని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు అని టాక్. ఆయనకంటూ ఒక టీం ని ఏర్పాటు చేసుకుని వారితోనే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారుట.

పార్టీలో సీనియర్ల నుంచి పెద్ద వారి నుంచి ఎవరి సలహాలూ సూచనలూ స్వీకరించడం లేదు అని బాలయ్య చిన్నల్లుడి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇక మొదట్లో ఆయనతో పాటు నడచిన వారు కూడా విసుగెత్తి తిరగడం మానేశారు అని అంటున్నారు.

తమ ఎంపీ అభ్యర్ధి గెలవాలని కష్టపడి పనిచేసినా ఆయనకు అసలు వారు గుర్తు ఉండడం లేదని దాంతో ఎందుకొచ్చిన తంటా అని పలువురు తప్పుకుంటున్నారుట. ఇక మరో ఆరోపణ ఏంటి అంటే తన సొంత సామాజిక వర్గానికే పెద్ద పీట శ్రీ భరత్ వేస్తున్నాడు అని.

అంతే కాదు తాను ఏ నియోజకవర్గానికి వెళ్ళినా నా వారు ఎక్కడా అని చూసుకుంటున్నారుట. వారు చోటా మోటా లీడర్ అయినా కూడా వారినే వెంట ఉంచుకుంటూ సీనియర్లను చులకనగా చూస్తున్నారని టీడీపీలో రచ్చ సాగుతోంది అని ప్రచారం నడుస్తుంది . దీంతో ఎమ్మెల్యే అభ్యర్ధులు కూడా ఏమిటీ ఈయన వైఖరి అని పట్టించుకోవడం మానేశారు అని అంటున్నారు.

విశాఖ ఎంపీ సీటు పరిధిలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్ధులలో సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన భీమిలీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను సైతం భరత్ పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. దీంతో గ్యాప్ పెరిగింది అని అంటున్నారు.

అలాగే మరో సీనియర్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఎస్ కోట నుంచి కోళ్ళ లలిత కుమారి ఉన్నారు ఆమెకు శ్రీ భరత్ కి మధ్య గ్యాప్ పెరిగింది అని అంటున్నారు.

ఇక విశాఖ పశ్చిమానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి పోటీలో ఉన్న పీజీవీఆర్ నాయుడు విషయంలోనూ శ్రీ భరత్ వైఖరి అలాగే ఉంటోందని అంటున్నారు. ఈయనతోనూ బాగా చెడింది అని అంటున్నారు. ఇదే పరిస్థితి మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఉంది అని అంటున్నారు. దాంతో సొంత పార్టీలోనే ఎంపీ అభ్యర్ధిత్వం మీద వ్యతిరేకత కనిపిస్తోంది అని అంటున్నారు.

4

ఇక ఈయన వైఖరిని చూసిన వారు ఆయన తమతో వస్తే ఆ ఎఫెక్ట్ తమ అసెంబ్లీ సీట్ల మీద కూడా పడుతుందని భావించి దూరం పెడుతున్నారుట. ఇక బీజేపీకి విశాఖలో కొంత బలం ఉంది. కానీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.

ఆయన వర్గం అలాగే ఉంది. అంతే కాదు బీజేపీకి అనుకూలంగా ఉన్న కొన్ని సెక్షన్లు కూడా టీడీపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నాయని అంటున్నారు. ఇది కూడా శ్రీ భరత్ కి ప్రతికూలంగా మారింది అని అంటున్నారు. ఇక జనసేన నేతలు కూడా ఈయన వద్దకు రావడంలేదుట. ఎందుకంటే టీడీపీ నేతలకే ఆయన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో మనకు ఏమిటి ఇస్తారులే అన్న భావనతో వారు సైడ్ అయ్యారని అంటున్నారు.

తన సొంత టీం తన గీతం కాంపౌండ్ దాటి బయటకు రాని భరత్ తో సొంత పార్టీ నేతలు మిత్ర పార్టీ నేతలూ దూరం పాటిస్తున్నారు అన్నది తాజా టాక్. దీంతో ఎవరూ కలసి రాక తనదైన పొలిటికల్ ప్లాన్స్ పారక ప్రస్తుతం విశాఖ ఎంపీ సీటుకు టీడీపీ అభ్యర్ధి అయిన శ్రీ భరత్ ఇబ్బందులు పడుతున్నారని ఒంటరి అయ్యారని టాక్ అయితే గట్టిగా ఉంది అంటున్నారు.

ఈయన రాజకీయల్లో జూనియర్ అని టీడీపీలో సీనియర్లు అనుకుంటున్నారు. వారు ఆలోచనలు అవుట్ డేటెడ్ అని ఈయన భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి కలసికట్టుగా ఎదుర్కోవాల్సిన ఎన్నికల విషయంలో ఇలా గ్యాప్ కనుక పెరిగితే అది ఇబ్బంది అని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ ఎంపీ సీటు టీడీపీకి ఎపుడూ టఫ్ గానే ఉంటుంది. ఇపుడు ఈ రకమైన ప్రతికూలతతో ముందుకు సాగితే ఏమవుతుంది అన్న చింత అయితే పార్టీలో ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News