• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కీలక కేసు.. వంశీ అరెస్టు...

కీలక కేసు.. వంశీ అరెస్టు తప్పదా?

| కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే అంటున్నారు

By - Tupaki Desk
Update: 2024-08-02 07:15 GMT

కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసి తగులబెట్టాయి. పలువురు టీడీపీ నేతలపై దాడులు కూడా జరిగాయి, నాడు ఈ వ్యవహారంపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదనే అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిందితులంతా వల్లభనేని వంశీ అనుచరులు కావడంతో వారిని వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిందితులపై చర్యలు చేపట్టింది. గన్నవరంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం, దహనం కేసులకు సంబంధించి పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయినవారిలో బాపులపాడు మండల పరిషత్‌ అధ్యక్షుడు నగేశ్‌ కూడా ఉన్నాడు.

కాగా ఈ కేసులో ఇప్పటివరకు వల్లభనేని వంశీని అరెస్టు చేయలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గన్నవరంలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన హైదరాబాద్‌ లోనే ఉంటున్నారని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక విజయవాడలో వల్లభనేని వంశీ ఉండే అపార్టుమెంటుపైకి కొందరు రాళ్లు రువ్వారు. దీంతో వల్లభనేని వంశీ కుటుంబంతో సహా హైదరాబాద్‌ వెళ్లిపోయారని అంటున్నారు.

వాస్తవానికి హైదరాబాద్‌ లో కూడా వంశీ లేరని.. ఆయన అమెరికా వెళ్లిపోయారని చెబుతున్నారు. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వల్లభనేని వంశీని పోలీసులు 71వ ముద్దాయిగా చేర్చారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

కాగా ప్రత్యక్షంగా, నేరుగా టీడీపీ కార్యాలయంపై దాడిలో వంశీ పాల్గొనలేదని చెబుతున్నారు. అయితే తన అనుచరులు ఉసిగొల్పి దాడులు చేయించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వల్లభనేని వంశీ అండ చూసుకునే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయని అంటున్నారు.

మే వరకు వైసీపీ అధికారంలో ఉండటంతో వంశీపైనా, ఆయన మనుషులపైనా ఈగ కూడా వాలలేదు. నిందితులంతా స్వేచ్చగా తిరిగారు. ఈ క్రమంలో జూన్‌ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిందితులపైన దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పోలీసులు 18 మందిని అరెస్టు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా ఇంతవరకు వల్లభనేని వంశీని అరెస్టు చేయకపోవడంతో టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పోలీసు బృందాలు తాజాగా హైదరాబాద్‌ వెళ్లాయి. అయితే వల్లభనేని వంశీ అక్కడ కూడా లేరని.. అమెరికా చెక్కేసి ఉంటారని అంటున్నారు.

Tags:    
  • Vallabhanenivamsimohan 
  • YSRCP 
  • Appolitics 
  • Vallabhanenivamsi 
  • Vallabhanenivamsiarrest 
  • TDP 
  • Apgovernment 
  • Gannavaram 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS