సె*క్స్ చేస్తూనే ప్రియుడిని హతమార్చిన మహిళ.. కారణం తెలిస్తే షాక్!
సె*క్స్ చేస్తూనే ప్రియుడిని హతమార్చిందో మహిళ. ఆ తర్వాత ఆమె చెప్పిన కారణం విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..;
రోజురోజుకు సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. పది నిమిషాల పడక సుఖం కోసం అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్ లో చోటుచేసుకుంది. సె*క్స్ చేస్తూనే ప్రియుడిని హతమార్చిందో మహిళ. ఆ తర్వాత ఆమె చెప్పిన కారణం విని పోలీసులు కూడా షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన 32 ఏళ్ల మహిళకు చాలా కాలం క్రితమే వివాహం అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఇక్బాల్(35) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇక్బాల్ జరీ జర్దోసీ కళాకారుడు. వృత్తి నిమిత్తం గ్రామంలో తిరుగుతున్న సమయంలో ఇక్బాల్ తో సదరు వివాహితకు పరిచయం ఏర్పడి నంబర్లు మార్చుకున్నారు. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఆపై వారి పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. తరచూ కలుస్తూ ఉండేవాళ్లు.
అయితే కొద్ది రోజులకే తన తప్పును గ్రహించిన సదరు మహిళ.. ఇక్బాల్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కానీ ఇక్బాల్ మాత్రం ఆమెను వదల్లేదు. ఇద్దరూ మాట్లాడుకున్న ఫోన్ రికార్డింగులు, సన్నిహితంగా ఉన్న వీడియోలు నీ భర్తకు చూపిస్తానంటూ ఇక్బాల్ బ్లాక్‌మెయిల్ స్టార్ట్ చేశాడు. తనతో సన్నిహితంగా ఉండమని బలవంతం చేశాడు. భర్తకు నిజం తెలిస్తే తన జీవితం, పిల్లల జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అని భయపడి ఇష్టం లేకపోయినా సదరు మహిళ ఇక్బాల్ ను కలుస్తూ ఉండేది.
ఇక బుధవారం ఇక్బాల్ తన భార్యను పుట్టింటికి పంపించి ప్రేయసిని ఇంటికి రావాలని బలవంతం చేశాడు. చేసేదేమి లేక రాత్రి 8 గంటల సమయంలో భర్తకు టీలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చిన మహిళ.. 11.40 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న ఇక్బాల్ ఇంటికి వెళ్లింది. అయితే ఈసారి ఇక్బాల్ తో బంధాన్ని ఎలాగైనా ముగించాలని భావించిన సదరు మహిళ.. అవసరమైతే చావడమో లేదా చంపడమో చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇక్బాల్ తో శృంగారంలో పాల్గొన్న సమయంలోనే అతని గొంతు పిసికి ఉక్కిరిబిక్కిరి చేసింది. దాంతో ఇక్బాల్ మరణించాడు.
ఆ తర్వాత అతని శరీరాన్ని మెట్ల మీదకు లాగి సదరు మహిళ ఇంటికి తిరిగి వచ్చేసింది. మృతుడి మృతదేహం అతని ఇంటి సమీపంలో కనుగొనబడిన రెండు రోజుల తరువాత, అతని భార్య నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆదివారం హత్య కేసులో 32 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మొదట మహిళ బుకాయించినా.. ఆ తర్వాత నిజం ఒప్పుకుంది. ఇక్బాల్ తనను లైంగికంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. అనేక సార్లు తనను శరీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది. ఇక్బాల్ బ్లాక్‌మెయిలింగ్‌తో విసిగిపోయానని.. వేరే మార్గం లేకే అతన్ని చంపాల్సి వచ్చిందని సదరు మహిళ నేరాన్ని అంగీకరించింది.