• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారత్ పౌరసత్వాన్ని...

భారత్ పౌరసత్వాన్ని వదులుకున్న వారిలో తెలుగు రాష్ట్రాల స్థానమిదే

| తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారో ఎంపీ.

By - Tupaki Desk
Update: 2023-08-11 05:19 GMT

రంగం ఏదైనా.. అంతర్జాతీయంగా అదరగొట్టేస్తున్న విదేశీయుల్లో ముందుంటున్నారు భారతీయులు. రాజకీయం కావొచ్చు.. సాంకేతిక రంగం కావొచ్చు.. వ్యాపారమైనా కావొచ్చు. విశ్వ వీధుల్లో తమ సత్తా చాటుతున్న భారతీయుల్లో ఎక్కువమంది తమ భారత పౌరసత్వాన్ని వదిలేసుకుంటున్న వారే. తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నను సంధించారో ఎంపీ.

గడిచిన పన్నెండేళ్లలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారు ఎందరు? దానికి సంబంధించిన వివరాలు రాష్ట్రాల వారీగా పేర్కొన్నారు. అదే సమయంలో ఏ సంవత్సరంలో ఎక్కువ మంది తమ పౌరసత్వాన్ని వదలుకున్నారన్న ప్రశ్నకు సమాధానాల్ని ఇచ్చారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్.

తాజాగా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆయన.. గడిచిన పన్నెండేళ్ల కాలంలో 16,63,440 మంది తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు.

అదే సమయంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2022 మధ్య కాలంలో 12,88,293 మంది తమ పౌరసత్వాన్ని సరెండర్ చేసినట్లుగా వెల్లడించారు. గడిచిన పన్నెండేళ్లలో 2022లో అత్యధికంగా పౌరసత్వాన్ని వదులుకున్నట్లుగా పేర్కొన్నారు. ఒక్క 2022లోనే 2,25,620 మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని.. రాష్ట్రాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఢిల్లీ నిలిచింది.

ఢిల్లీ నుంచి 60,414 మంది తమ భారత పౌరసత్వాన్ని వదులుకోగా.. తర్వాతి స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ నుంచి 22,300 మంది, గోవా నుంచి 18,610 మంది.. మహారాష్ట్ర నుంచి 17,171 మంది, తమిళనాడు నుంచి 14,046 మంది తమ పౌరసత్వాన్ని సరెండర్ చేశారన్నారు. ఇక.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీకి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 7,256 మంది ఉంటే.. ఏపీ విషయానికి వస్తే 9,235 మంది ఉన్నట్లుగా మంత్రి వెల్లడించారు.

Tags:    
  • Telugustates 
  • Indiancitizenship 
  • Narendramodi 
  • Rajyasabha 
  • VMuralidharan 
  • Politicalnews 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS