• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యావత్ ప్రపంచం హైదరాబాద్...

యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూసే ప్రోగ్రాం షెడ్యూల్!

| యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చేసే ఒక ఆసక్తికర పోటీలకు వేదికగా మారనుంది. ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ను ఎంపిక చేశారు.

By - Tupaki Desk
Update: 2025-02-20 04:55 GMT

యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చేసే ఒక ఆసక్తికర పోటీలకు వేదికగా మారనుంది. ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ను ఎంపిక చేశారు. ఈ ఏడాది మే 4 నుంచి 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ.. ముగింపు వేడుకలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ మేరకు నిర్వాహకులు పోటీల వివరాల్ని బుధవారం ప్రకటించారు. ప్రపంచానికి చెందిన 140 దేశాలకు చెందిన ‘మిస్’ లు ఈ పోటీల్లో పొల్గొంటున్నారు. ఇప్పటివరకు ఈ పోటీలు మన దేశంలో రెండు సార్లు మాత్రమే జరిగాయి.


గతంలో 1996లో మొదటిసారి జరగ్గా.. రెండోసారి గత ఏడాది జరిగాయి. మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగే అవకాశాన్ని సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ముంబయి వేదికగా ఈ పోటీలు జరిగాయి.నిజానికి ఈసారి పోటీలకు దుబాయ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది.అయితే.. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపుతో పాటు చారిత్రక.. గ్రామీణ ప్రాంతాల ప్రత్యేకతల కారణంగా హైదరాబాద్ మహానగారానికి ఈ పోటీల్ని నిర్వహించే అవకాశం లభించిందని చెప్పాలి.

తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీల్ని నిర్వహించనున్నట్లుగా మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్ పర్సన్.. సీఈవో జూలియా మోర్లీ.. రాష్ట్ర పర్యాటక.. సాంస్క్రతిక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ తో కలిసి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంతో శ్రమించి ఈ పోటీల్ని తెలంగాణకు తీసుకొస్తున్నట్లుగా స్మితా సభర్వాల్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేకల్ని వివరించామని.. దీని కోసం దాదాపు నెల రోజులుగా చర్చలు జరిపినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ సంప్రదాయాలు.. కళలు వివిధ థీమ్ లు రూపొందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏమైనా.. ఈ పోటీలు ప్రపంచ దేశాల ద్రష్టిలో హైదరాబాద్ మహానగరం పడేలా చేస్తాయని చెప్పక తప్పదు.

Tags:    
  • Missworldpageant 
  • Hyderabad 
  • Telangana 
  • Missworldcompetition 
  • Smitasabharwal 
  • Telanganatourism 
  • Revanthreddy 
  • Telanganagovernment 
  • Juliamorley 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS