జగన్‌ను ఓవర్ టేక్ చేసిన సీఎం రేవంత్!
క్షేత్రస్థాయిలో మంగళవారం పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. బాధితులకు అండగా ఉండడంతోపాటు.. పరిశ్రమ యాజమాన్యాన్నికూడా నిలదీశారు. అసలు ఏం జరిగింది?;
రాజకీయాల్లో నాయకులు వేసే అడుగులు కీలకంగా ఉంటాయి. ముఖ్యమంత్రులుగా వ్యవహరించే నాయ కులు చేసే పనులు కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. ఒక రాష్ట్ర సీఎంతో మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని పోల్చుకోవడం.. ఇటీవల కాలంలో సాధారణంగా మారింది. గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ శైలిని.. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శైలిని కంపేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పడుతు న్నాయి. ఆశ్చర్యం అనిపించినా ఇది మాత్రం వాస్తమే.
తాజా రంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలి తీవ్ర దుర్ఘటన సంభవించింది. ప్రమాదాల విషయంలో ఎవరూ ప్రిడెక్ట్ చేయలేక పోయినా.. ప్రభుత్వం, పరిశ్రమల బాధ్యత అంటూ.. ఒక టి ఉంటుంది. ఈ విషయంలో సర్కారు సహా సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది కీలకం. గతంలో ఏపీలో సీఎం జగన్ ఉన్నప్పుడు విశాఖ పరవాడలోని ఎల్ జీ పరిశ్రమలోనూ ఇలానే ఓ దుర్ఘటన సంభవించింది. ఆ సమయంలో నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లిన జగన్.. బాధితులను ఓదార్చారు.
వారి కుటుంబాలను ఆదుకున్నారు. అయితే.. ఘటన జరిగిన పరిశ్రమ సిబ్బందిని ప్రశ్నించడం కానీ.. వారిపై కేసులు పెట్టించడం కానీ.. పరిహారం ఇప్పించడం కానీ .. చేయలేకపోయారు. అసలు సీరియస్ కూడా కాకపోవడం గమనార్హం. కానీ.. పాశమైలారంలో జరిగిన ప్రమాద ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు సర్కారు నుంచి పరిహారం ఇస్తూనే.. సంబంధిత పరిశ్రమపై చర్యలు తీసుకునేలా హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు.
క్షేత్రస్థాయిలో మంగళవారం పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. బాధితులకు అండగా ఉండడంతోపాటు.. పరిశ్రమ యాజమాన్యాన్నికూడా నిలదీశారు. అసలు ఏం జరిగింది? అనే ప్రశ్న నుంచి యాజమాన్యం బాధ్యత వరకు నిప్పులు చెరిగారు. దీంతో ఇతర పరిశ్రమల యజమానులు.. ఒకింత జాగ్రత్తగా వ్యవహరిం చే అవకాశం ఉంటుంది. కానీ.. గతంలో జగన్ ఇలా వ్యవహరించలేకపోయారు. దాదాపుగా ఘటన ఒకే తరహాలో ఉన్న నేపథ్యంలో నెటిజన్లు ఈ కంపేరిజన్ చేస్తుండడం గమనార్హం.