• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీ డ‌బుల ప్ల‌స్‌.....

వైసీపీ డ‌బుల ప్ల‌స్‌.. టీడీపీ డ‌బుల్ మైన‌స్‌.. ఈ విష‌యం తెలుసా ..!

| కనీసం ప్రజల మధ్యకు వెళ్ళకపోవడం వంటివి సీఎం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-07-12 20:30 GMT

సహజంగా ఏ పార్టీకైనా ఆ పార్టీ అధినేత చెప్పినట్టు నడవాలనేది ఒక నిబంధన. పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరూ అధినేత‌ చెప్పినట్టు వినాలి. పార్టీ అధినేత చెప్పినట్టు నడుచుకోవాలి. కానీ, రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల విషయంలో అధినేతలు చెబుతున్నప్ప‌టికీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు మాత్రం పట్టించుకోవడం లేదనేది స్పష్టంగా వినిపిస్తోంది. అది ప్రభుత్వంలో ఉన్న టిడిపి, ప్రతిపక్షంలో ఉన్న వైసిపి అయినా.. ఈ రెండు పార్టీల్లోనూ పరిస్థితులు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి.

పార్టీ అధినేత ఒక ప్రకటన ఇస్తారు. క్షేత్రస్థాయిలో చేయాలని చెప్తారు. కానీ, దానికి భిన్నంగా జ‌రుగుతున్నాయి. టిడిపి విషయానికి వస్తే అధినేత చెప్పే పనులు చేయడం లేదు. ఇక వైసిపి విషయానికి వస్తే జగన్ చెప్పిన దానికన్నా అతిగా చేసేస్తున్నారు. ఈ రెండు పరిణామాలు రెండు పార్టీలలోను భిన్నంగా కనిపిస్తున్నాయి. అతిగా చేయడం ఎంత ప్రమాదమో అసలు చేయకపోవడం కూడా అంతే ప్రమాదం. టిడిపి విషయానికి వస్తే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 50 రోజుల సమయాన్ని కేటాయించారు. కానీ ఇప్పటివరకు కనీసం వంద నియోజకవర్గాల్లో కూడా పార్టీ నాయకులు కార్యక్రమాన్ని చేపట్టలేదు.

కనీసం ప్రజల మధ్యకు వెళ్ళకపోవడం వంటివి సీఎం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తాను చెప్పినా కూడా వినడం లేదని, తాను ఆదేశించిన కూడా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే ఏదైనా కార్యక్రమం నిర్వహించుకుని.. జన సమీకరణ చేయండి, కార్యకర్తలను తరలించండి అంటే ఆయన చెప్పిందానికన్నా అతిగా తీసుకురావడం, అతిగా వ్యవహరించడం వంటివి అపార్టీలోనూ చర్చనీయాంశంగా మారాయి. చేస్తే అతి, లేకపోతే లేదు అన్నట్టుగా క్షేత్ర‌ స్థాయిలో నాయకులు వ్యవహరిస్తున్నారని వైసీపీఅధినేత‌ జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా ఘటన‌లో ట్రాక్టర్లతో మామిడికాయలు తీసుకువచ్చే విషయం అసలు త‌న‌ దృష్టిలో లేదని జ‌గ‌న్ చెబుతున్నారు. ఈ విష‌యాన్ని పార్టీ అంతర్గతంగా చర్చించిన సమావేశంలో వెల్ల‌డైంది. నాకు చెప్పకుండానే మీరు ఎందుకలా చేశారని జగన్ ప్రశ్నించారు. అంతేకాదు అసలు అంతమందిని తరలించేటప్పుడు కనీసం నాకు ఒక మాట అయినా చెప్పి ఉండాలి కదా అని జగన్ సీనియర్ నాయకులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇలా.. అటు టీడీపీలో చెప్పిన దానిని నాయ‌కులు ప‌ట్టించుకోక‌పో వ‌డం.. వైసీపీలో చెప్పిన దానికంటే కూడా ఎక్కువ‌గా చేయ‌డం వంటివి ఇరు పార్టీల్లోనూ చ‌ర్చ‌గా మారింది.

Tags:    
  • TDP 
  • YSRCP 
  • AndhraPolitics 
  • PoliticalDiscipline 
  • ChandrababuNaidu 
  • YSJagan 
  • GroundReality 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS