'కొసరు' కోసం.. అసలు వదిలేస్తున్న తమ్ముళ్లు ..!
అంతేకాదు.. అవసరం అయితే.. స్పూన్ ఫీడింగ్ కూడా చేయాలని చంద్రబాబు అంటున్నారు. మరి నాయ కులు చెబుతున్నారా?;
``ప్రజల్లోకి వెళ్లండి.. మన గురించి ప్రచారం చేయండి. మనం ఏడాది కాలంగా చేస్తున్న మంచిని వివరిం చండి.`` - ఇదీ..చంద్రబాబు పదే పదే చెప్పిన మాట. చెబుతున్న మాట కూడా. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలను కలుసుకోవాలని ఆయన నాయకులకు సూచిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లాలని చెబుతున్నారు. గత ఏడాది ఇచ్చిన సూపర్ 6లో అమలు చేసిన సంక్షేమాన్ని, చేయబోయే పనులను కూడా వివరించాలని చెబుతున్నారు.
అంతేకాదు.. అవసరం అయితే.. స్పూన్ ఫీడింగ్ కూడా చేయాలని చంద్రబాబు అంటున్నారు. మరి నాయ కులు చెబుతున్నారా? అదే పనిచేస్తున్నారా? అంటే.. అసలు.. మొత్తం 135 నియోజకవర్గాల్లో(టీడీపీ గెలిచి న) 52 నియోజకవర్గాల్లో మాత్రమే తొలి రోజు సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత రోజు ఈ సంఖ్య 30కి పడిపోయింది. పోనీ.. ఈ నియోజకవర్గాల్లో కూడా.. నాయకులు ఏం చేస్తున్నారంటే.. ఒకరిద్దరు తప్ప.. అందరూ.. స్వోత్కర్షలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అంటే.. తాము లేకపోతే.. ఇక, నియోజకవర్గంలో ప్రజలకు జీవితమే లేదన్నట్టుగా అతి ప్రచారం చేస్తున్నా రు. ఇదేసమయంలో వైసీపీపై అరిగిపోయిన రికార్డునే ప్లే చేస్తున్నారు. జగన్ తల్లిని-చెల్లినివదిలేసాడని.. ఆయనను నమ్మొద్దని చెబుతున్నారు. వాస్తవానికి ఈ తరహా ప్రచారం ఎన్నికలకు ముందు బాగుంటుంది. లేకపోతే.. చంద్రబాబు స్థాయి నాయకుల ద్వారా ప్రచారం బాగుంటుంది. కానీ.. క్షేత్రస్థాయిలో ప్రజల వద్ద కు వెల్లినప్పుడు వారి సమస్యలపై స్పందించాలి. వ్యక్తిగత అంశాలపై దృష్టి పెట్టాలి.
అంతేకాదు.. చంద్రబాబు చెప్పినట్టు.. సూపర్ -6 పై ప్రచారం చేయాలి. వీటిని వదిలేసి.. వ్యక్తిగత గొప్పలు.. లేకపోతే.. వైసీపీని తిట్టిపోయడం వరకు నాయకులు పరిమితం అవుతున్నారు తద్వారా.. చంద్రబాబు కంట్లో పడాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకే.. ఉత్తరాంధ్ర సహా సీమలో నాయకులు ఇదే తరహాలో రెచ్చిపోతున్నారు. కానీ, ఇది అసలు వదిలేసి.. కొసరు కోసం వెంటపడుతున్నట్టుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. సమయం , సందర్భం చూసుకుని విమర్శలు చేస్తే.. ప్రజలకు చేరువ అవుతారు కానీ.. అసందర్భంగా ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వల్ల మైనస్ అవుతారని అంటున్నారు.