• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రేయింబ‌వ‌ళ్లు.....

రేయింబ‌వ‌ళ్లు.. త‌మ్ముళ్లు అక్క‌డే!

| తాజాగా గురువారం సాయంత్రం దీనిపై వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన మంత్రి నారా లోకేష్‌.. ప‌నులు వేగ‌వంతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2025-05-23 08:30 GMT

టీడీపీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ ఏడాది మ‌హానాడుకు మ‌రో నాలుగు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ నెల 27-29 మ‌ధ్య మూడు రోజుల పాటు మ‌హానాడును అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించా ల‌ని పార్టీ నిర్ణ‌యించింది. అంతేకాదు.. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా కూడా తీసుకుంది. క‌డ‌ప‌లో తొలిసారి నిర్వ‌హిస్తుండ‌డం.. కూట‌మి ప్ర‌భుత్వం జోరుగా ముందుకు సాగుతున్న నేప‌థ్యంలో ఈ ద‌ఫా మ‌హానాడు ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

ఇప్ప‌టికే మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌కు.. పార్టీ అధినేత చంద్ర‌బాబు 19 క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. అయితే.. మ‌ధ్య‌లో ఆప‌రేష‌న్ సిందూర్ కార‌ణంగా వాయిదా వేయాల‌ని అనుకోవడంతో మ‌హానాడు ప‌నులు కొంత మంద‌గించాయి. త‌ర్వాత‌.. భారత్‌-పాక్‌ల మ‌ధ్య ప‌రిస్థితులు కొంత మేర‌కు స‌ర్దుబాటు కావ‌డంతో మ‌హానా డును నిర్వహించాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. అప్ప‌టికి నాలుగైదు రోజులు ప‌నులు ముందుకు సాగ‌క పోవ‌డంతో ఎక్క‌డి ప‌నులు అక్క‌డే నిలిచిపోయాయి.

తాజాగా గురువారం సాయంత్రం దీనిపై వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన మంత్రి నారా లోకేష్‌.. ప‌నులు వేగ‌వంతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. రాయ‌ల‌సీమ స‌హా నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు చెందిన సీనియ‌ర్లు, ద్వితీయ శ్రేణి నాయ‌కులు హుటాహుటిన క‌డ‌ప‌కు వెళ్లాల‌ని.. త‌లా ఒక్క‌రు ప‌నిని పంచుకో వాల‌ని ఆయ‌న సూచించారు. అంతేకాదు.. రేయింబ‌వ‌ళ్లు ప‌నులు చేస్తే త‌ప్ప‌.. నాలుగు రోజుల్లో ఏర్పాట్లు పూర్తి కావ‌ని కూడా తేల్చి చెప్పారు. అదేస‌మ‌యంలో అధికార యంత్రాంగానికి కూడా ప‌లు సూచ‌న‌లు చేశారు.

ప్ర‌జ‌లు, నాయ‌కుల భ‌ద్ర‌త‌, ట్రాఫిక్ క్లియ‌రెన్స్‌, వ‌ర్షం వ‌చ్చినా.. ఎలాంటి ఇబ్బందులులేకుండా సాగేలా ఏర్పాట్లు చేయాల‌ని.. అవ‌స‌ర‌మైతే.. షిఫ్టుల వారీగా ప‌నిచేయాల‌ని.. ప‌నులు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆగ‌డానికి వీల్లేద‌ని.. 26వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప‌నులు పూర్తికావాల‌ని కూడా డెడ్‌లైన్ పెట్టారు. దీంతో త‌మ్ముళ్లు హుటాహుటిన క‌డ‌ప‌కు చేరుకుని రేయింబ‌వ‌ళ్లు అక్క‌డే ఉండి.. ప‌నులు చేయించేందుకు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టారు. మొత్తానికీ ఈ నాలుగు రోజులు మ‌హానాడు ప‌నులు జోరుగా సాగుతాయ‌ని అధికారులు కూడా చెబుతున్నారు.

Tags:    
  • TDPMahanadu2025 
  • ChandrababuNaidu 
  • KadapaMahanadu 
  • NaraLokesh 
  • AndhraPolitics 
  • RayalaseemaPolitics 
  • TDPEvent 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS