• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమ్మాయిల బాత్ రూమ్ లో...

అమ్మాయిల బాత్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు... అసలు ఏమి జరిగింది?

By - Tupaki Desk
Update: 2024-08-30 06:35 GMT

ఏపీలో తాజాగా ఓ ఘోర ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే వదంతుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. అమ్మాయిల బాత్ రూమ్ లో కెమెరాలు పెట్టి.. ఆ వీడియోలను పలువురికి షేర్ చేస్తున్నారు అన్న దారుణ వదంతులు  ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

అవును... గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఓ దారుణ విషయం వెలుగు చూసింది. ఇందులో భాగంగా.. అమ్మాయిల హాస్టల్ బాత్ రూమ్ లో కెమెరా ఉండటాన్ని విద్యార్థులు గుర్తించారు అనేది ఆరోపణ! ఈ సమయంలో ఈ వ్యవహారంపై హాస్టల్ వార్డెన్ కు ఫిర్యాదు చేయగా... అత్యంత షాకింగ్ విషయాలు బయటపడ్డాయని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆడపిల్లల తల్లితండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది!

వివరాళ్లోకి వెళ్తే... గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే విషయాన్ని అమ్మాయిలు గుర్తించారట. అయితే ఈ విషయం కాలేజీ యాజమాన్యానికి తెలిసినా విషయం బయటకు పొక్కకుండా మౌనంగా ఉన్నారనే ఆరోపణలూ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. దీంతో... గురువారం అర్ధరాత్రి దాటాక విద్యార్థినిలు సెల్ ఫోన్ లైట్స్ చేతపట్టి ఆందోళన చేపట్టారు.

తెల్లవారుజామున మూడున్నర గంటలవరకూ ఈ అందోళన కొనసాగింది. ఈ సమయంలో... ఈ వ్యవహారం అంతా నడిపింది ఓ అమ్మాయే అనే విషయం తెలిసిందని.. దీంతో వారంతా షాక్ కి గురయ్యారని అంటున్నారు. మరో ఘోరమైన విషయం ఏమిటంటే... తన బాయ్ ఫ్రెండ్స్ కోసమే ఇద్దరు అమ్మాయిలు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని చెబుతున్నారు.

దీంతో... పరిస్థితులు ఇంత దారుణంగా మారిపోయాయా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు ప్రజానికం. ఈ సమయంలో ఈ ఘోరం వెలుగులోకి రావడంతో ఆగ్రహించిన విద్యార్థినులు యాజమాన్యంపై మండిపడుతున్నారు.

మరోపక్క ఇలాంటి తప్పుడు పనిచేసిన విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సద్దుమణించే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే... కాలేజీ యాజమాన్యం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకపోవడం గమనార్హం!.

మరోపక్క ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను వైసీపీ షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్, పవన్ లను ట్యగ్ చేసి విషయంపై దర్యాప్తుకు డిమాండ్ చేస్తుంది! ప్రస్తూతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోపక్క ఈ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల పేరెంట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

చంద్రబాబు కీలక ఆదేశాలు!:

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే ఆరోపణల వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇందులో భాగంగా ఆయన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు టీడీపీ తన ఎక్స్ ఖాతాలో విషయాన్ని పోస్ట్ చేసింది.

Tags:    
  • Andhrapradesh 
  • Srgudlavalleruengineeringcollege 
  • Collegestudents 
  • Hiddencameras 
  • Girlshostelwashroom 
  • Hostelwashroomcameras 

Similar News

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

Copyright @2026

Powered by Blink CMS