• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అరెస్ట్ వారెంట్ పై...

అరెస్ట్ వారెంట్ పై స్పందించిన సోనూసూద్... ప్రచారంపై అసహనం!

| ముంబైలోని అందేరి వెస్ట్ లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్ కు లుథియానా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు.

By - Tupaki Desk
Update: 2025-02-07 09:16 GMT

ప్రముఖ నటుడు సోనూసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. చీటింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్ లోని లుథియానా కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా.. సోనూసూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వ్యుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సోనూసూద్ స్పందించారు.

అవును... ముంబైలోని అందేరి వెస్ట్ లో ఉన్న ఒషివారా పోలీస్ స్టేషన్ కు లుథియానా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రమన్ ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. సోనూసూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వ్యుల్లో పేర్కొన్నారు. దీంతో... ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సోనూసూద్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.

దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్న వార్తలు చాలా సంచలనాత్మకమైన విషయాలు అని మొదలుపెట్టిన సోనూసూద్... విషయం సూటిగా, సరళంగా చెప్పాలంటే ఇది తనకు ఎలాంటి సంబంధం లేని అంశం అని అన్నారు.

ఇదే సమయంలో... ఈ విషయంలో కోర్టు తనను సాక్షిగా మాత్రమే పిలిచిందని తెలిపారు. దీనిపై తమ న్యాయవాదులు కోర్టుకు సమాధానం ఇచ్చారని.. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10న దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని అన్నారు. మరోసారి.. ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

ఇదే క్రమంలో... దీనిపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తోందని చెప్పిన సోనూసూద్.. సెలబ్రెటీలను టార్గెట్ చేయడం బాధాకారమని అన్నారు. దీనిపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా... లుథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా.. తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. ఈ సమయంలో.. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు లాయర్.. నటుడు సోనూసూద్ ను సాక్షిగా పేర్కొన్నారు.

దీంతో... ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. సోనూసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పలుమార్లు సమన్లు పంపించినా అతను హాజరుకాలేదని.. వెంటనే అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని మెజిస్ట్రేట్ ఉత్తర్వ్యుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది.

Sonu Sood reacts to the arrest warrant.#SonuSood #ArrestWarrant #Actor #Ludhiana #Tupaki https://t.co/pRCuF4AWy5 pic.twitter.com/gbgF4hIt02

— Tupaki (@tupaki_official) February 7, 2025
Tags:    
  • SonuSood 
  • ArrestWarrant 
  • CheatingCase 
  • PunjabCourt 
  • LegalDrama 
  • MediaTargeting 
  • SonuSoodUpdates 
  • CourtCase 
  • Bollywood 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS