విజ‌య‌వాడ వెస్ట్‌లో గెలిచేదెవ‌రు?

ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా మైనారిటీ నాయ‌కుడు ఆసిఫ్ పోటీ చేస్తున్నారు.

Update: 2024-04-29 01:30 GMT

`నేను సామాన్యుడిని. న‌న్ను గెలిపించండి!` అని ఒక‌రు. `నేను అసామాన్యుడిని. మిలియ‌నీర్‌ను నన్ను గెలిపించండి! నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేస్తా` అని ఇంకొక‌రు.. ప్ర‌జ‌ల‌కు విన్న‌విస్తున్నారు. ఓటు బ్యాంకు రాజ‌కీయాల్లో ఇద్ద‌రూ దూసుకుపోతున్నారు. అయితే.. ప్ర‌జలు ఎటు వైపు మొగ్గు చూపిస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. అదేవిజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం.. ఇక్క‌డ నుంచి కూట‌మి అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి పోటీలో ఉన్నారు.

ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా మైనారిటీ నాయ‌కుడు ఆసిఫ్ పోటీ చేస్తున్నారు. గ‌తంలో ఈయ‌న కార్పొరే ట‌ర్‌గా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడు కావ‌డం కొంత ప్ల‌స్‌. అయితే.. ఇద్ద‌రి నాయ‌కుల ప్ర‌చారం కూడా దుమ్మురేపుతున్న విష‌యం తెలిసిందే. సుజ‌నా విష‌యాన్ని తీసుకుంటే.. ఈయ‌న‌ను గెలిపించుకోవ‌డం బీజేపీ కంటే కూడా.. మిత్ర‌ప‌క్షం టీడీపీకి చాలా ఇంపార్టెంట్‌గా మారింది. దీంతో ఆయ‌న ప‌క్షాన బుద్దా వెంక‌న్న, ఎంపీ అభ్య‌ర్థి కేశినేని చిన్ని వంటివారు ప్ర‌చారం చేస్తున్నారు.

Read more!

సుజ‌నా కూడా.. కేర‌ళ నుంచి క‌ళాకారుల‌ను తీసుకువ‌చ్చి.. ఇక్క‌డ ప్ర‌చారం చేయిస్తున్నారు. తాను కూడా వాహ‌న యాత్ర‌లు చేస్తున్నారు. పైగా తాను కోటీశ్వ‌రుడిన‌ని ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఎదురు దాడి చేయ‌కుండా.. ఔను నేను కోటీశ్వ‌రుడినే.. రేపు గెలిచిన త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గాన్ని అబివృద్ది చేస్తాన‌ని చెబుతున్నారు. ఇది ఆయ‌న‌కు ప్ల‌స్ అయ్యే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా ఇక్క‌డి వ‌స్త్ర వ్యాపారుల‌కు ఆయ‌న సంచ‌ల‌న హామీలు ఇస్తున్నారు.

ఇక్క‌డి వ‌స్త్ర వ్యాపారులు జీఎస్టీ విష‌యంలో కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ను 18 శాతం ప‌రిధిలోని జీఎస్టీలోకి తీసుకురావాల‌ని కోరుతున్నారు. దీనికి సుజ‌నా గ‌ట్టి హామీలే ఇస్తున్నారు. మ‌రోవైపు ఆసిఫ్ లోక‌ల్ కామెంట్లు చేస్తున్నారు. తాను లోక‌ల్ అని... ప‌దే ప‌దే చెబుతున్నారు. ఆర్థికంగా చూసుకుంటే. ఈయ‌న వీక్‌గానే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. మైనారిటీ వ‌ర్గంలో ఆయ‌న‌కు ఫాలోయింగ్ బాగానే ఉంది. దీంతోఎవ‌రు గెలుస్తార‌నేది స‌స్పెంన్స్‌గా కొన‌సాగుతోంది.

Tags:    

Similar News