ఏడోస్సారి : పాలమూరు గెలుపుపై రేవంత్ గుబులు !

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం పరిధిలో రేవంత్ శాసనసభ స్థానం కొడంగల్ వస్తుంది.

Update: 2024-04-23 15:30 GMT

లోక్ సభ ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండెల్లో గుబులు రేపుతున్నాయా ? స్వంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు వస్తాయని రేవంత్ ఆందోళన చెందుతున్నాడా ? అందుకే తన నియోజకవర్గంలో తక్కువ ఓట్లు వచ్చేలా కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నాడ3 ? సొంత పార్టీ నేతలే రేవంత్ ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయా ? అంటే అన్నీ నిజమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం పరిధిలో రేవంత్ శాసనసభ స్థానం కొడంగల్ వస్తుంది. అక్కడి నుండి రాహుల్ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యుడు చల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అక్కడ ఆయన గెలుపు రేవంత్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు.

అయినా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తుందన్న విషయం రేవంత్ కు నమ్మకం కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ పోలింగ్ కు మరో 20 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ రోజుతో ఏడు సార్లు పర్యటించడం గమనార్హం.

Read more!

ఉదయం కొండగల్ పర్యటనకు వెళ్తున్న రేవంత్ సాయంత్రం నాగర్ కర్నూలు పర్యటనకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవకుంటే ముఖ్యమంత్రి పీఠానికి ఇబ్బందులు తప్పవని భయపడుతున్న రేవంత్ ఇలా సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అసలు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉంటుందోనని సరివత్ర ఉత్కంఠ నెలకొన్నది.

Tags:    

Similar News