• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రేకింగ్... రేవంత్ ...

బ్రేకింగ్... రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారంలో మార్పు!

| అవును... తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది.

By - Tupaki Desk
Update: 2023-12-06 06:49 GMT

తెలంగాణ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ లోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సమయంలో రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది.

అవును... తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది. ముందుగా గురువారం ఉదయం 10:28 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించగా.. తాజాగా ఆ సమయాన్ని కాస్త మార్చారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు రేవంత్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు ఈ మారిన సమయాన్ని వెల్లడించాయి.

మరోవైపు రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సమయంలో... తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కాంగ్రెస్‌ అగ్రనేతలను ఆయన ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తో సమావేశమైన రేవంత్‌.. ఆ తర్వాత అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ ను కలిశారు.

ఇలా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించిన అనంతరం కేబినెట్ కూర్పు, ఇతర అంశాలపై వారితో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో సోనియా, రాహుల్‌ గాంధీతో రేవంత్ రెడ్డి సుమారు 50 నిమిషాల పాటు వివిద అంశాలపై చర్చించారని తెలుస్తుంది!

ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై ఎల్బీ స్టేడియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలతో.. పోలీసు, సాధారణ పరిపాలన శాఖ అధికారులు చర్చించారు.

Tags:    
  • Telanganaelections 
  • Telangana 
  • Politicalnews 
  • Congress 
  • Revanthreddy 
  • Cheifminister 
  • Oath 

Similar News

ఈ-20 వ‌ర్సెస్ 420 : రాహుల్ కొత్త వివాదం!

2026-11-08 12:30 GMT

కాంగ్రెస్ బ‌ల‌మా... ప‌ర్స‌న‌ల్ ఎటాచ్‌మెంటా.. ?

2026-11-08 11:15 GMT

జ‌గ‌న్ - అదానీ భేటీ.. పొలిటిక‌ల్ చ‌ర్చ నిజ‌మేనా ..?

2026-11-08 11:14 GMT

దుర్మార్గుడు... కేటీఆర్‌: రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు

2026-11-08 11:14 GMT

రిమాండ్ ఖైదీ సంచలన విజయం.. జడ్పీటీసీగా వైసీపీ నేతకు పట్టం కట్టిన ఓటర్లు

2026-11-08 11:14 GMT

స్థానికం అంటే ఇంతేమరి.. ఓటర్ల లెక్క వేరే, ఈ ఫలితాలే నిదర్శనం

2026-11-08 11:12 GMT

పరిటాల శ్రీరామ్‌ ఫస్ట్ విక్టరీ.. శ్రీసత్యసాయి జడ్పీ తొలి చైర్మనుగా అవకాశం

2026-11-08 11:11 GMT

వైసీపీ గెలుపు లెక్క...కిందా పడినా పైచేయి అంటూ !

2026-11-08 07:52 GMT

ఉత్తరాంధ్రలో జనసేనకు జెడ్పీ పీఠ ముడి !

2026-11-08 07:49 GMT

బద్ద వ్యతిరేకులైన అరబ్ పార్టీలతో దోస్తీ.. ఇజ్రాయెల్ లో కొత్త రాజకీయ చిచ్చు..

2026-11-08 07:48 GMT

బొత్స దుస్సాహసం ఫలితం

2026-11-08 07:47 GMT

మనసులో చీకట్లు తొలగించుకో !

2026-11-08 06:44 GMT

Copyright @2026

Powered by Blink CMS