జగన్ - అదానీ భేటీ.. పొలిటికల్ చర్చ నిజమేనా ..?
| వైసీపీ అధినేత జగన్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చెన్నైలో సుమారు గంటన్నర పాటు సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. గతంలో జగన్ హయాంలో అదానీ సంస్థలకు పలు వ్యాపార ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాజకీయ అంశాలపై ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి.
ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన కీలక అంశం వైసిపి అధినేత జగన్ అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త కేంద్ర ప్రభుత్వంతో అత్యంత దగ్గర సంబంధాలు నడుపుతున్న గౌతం అదాని.. వీరిద్దరూ చెన్నైలో భేటీ కావడం. సుమారు గంటన్నర పాటు పరస్పరం ఒక హోటల్లో ఏకాంతంగా కలుసుకుని చర్చించారు అన్నది ఇప్పుడు రాజకీయంగా కీలక అంశంగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి వస్తామని, రావాలని భావిస్తున్న వైసిపి ప్రస్తుతం రాష్ట్రంలో ఒంటరి ప్రయాణం సాగిస్తోంది.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్ర పార్టీలతో పొత్తు పెట్టుకుని వడి వడిగా ముందుకు సాగుతోంది. ఇటువంటి సమయంలో బిజెపికి అత్యంత సన్నిహితుడిగా ముఖ్యంగా బీజేపీ అగ్ర నేతలకు అత్యంత మిత్రుడుగా ఉన్న ఆదానితో జగన్ రెడ్డి భేటీ కావడం అనేది సహజంగానే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అయితే, నిజంగానే వీరు మధ్య రాజకీయంగా చర్చ నడిచిందా లేదా అనేది ప్రస్తుతం ఇది ఊహలకి మాత్రమే పరిమితమైంది. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
అయితే ఒకటి మాత్రం వాస్తవం జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆదాని పోర్టులు కావచ్చు, ఇతర రూపాల్లో కావచ్చు విద్యుత్తు ఒప్పందాల్లో కావచ్చు ఆయనకు జగన్ సహకరించారు అన్నది వాస్తవం. అలాగే అదానికి ..ముకేశ్ అంబానీ కి మిత్రుడైన పరిమళనత్వానికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. సో ఇవన్నీ జాతీయ స్థాయిలో వ్యాపార వర్గాలకు జగన్‌కు మధ్య బంధాన్ని బలోపేతం అయితే చేసింది. అలాగే విశాఖపట్నంలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు కూడా ఆదానికి అప్పట్లోనే.. జగన్ పచ్చ జెండా ఊపడం ఇటీవల వార్తల్లోనూ కనిపించింది.
ఇక సోలార్ విద్యుత్ ఒప్పందాలు, స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు వంటివి కూడా జగన్ హయాంలోనే జరిగాయి. అంటే ఒక రకంగా ఆదానికి జగన్కు మధ్య వ్యాపార పరమైన సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు అవి పొలిటికల్ గా మారుతున్నాయా నిజంగానే పొలిటికల్గా అలానే జగన్‌కు ఏమన్నా హెల్ప్ చేయాలని భావిస్తున్నారా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు అనేది విశ్వేషకుల అంచనా. ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంతో కూడా ఆదాని రాజకీయంగా కంటే వ్యాపార పరంగానే ఒప్పందాలు చేసుకున్నారు.
విశాఖపట్నంలో డేటా కేంద్రం మంచి నిర్మాణ దశలో ఉంది. అలాగే సౌర విద్యుత్ ఒప్పందాలు కొనసాగుతున్నా యి. స్మార్ట్ మీటర్ల మార్పిడి జరుగుతుంది. సో ఇవన్నీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయనకు అనుకూలంగా ఉండబట్టే జరుగుతున్నాయి అన్నది వాస్తవం. కాబట్టి ఈ సమయంలో జగన్‌తో ఏకపక్షంగా రాజకీయాలపై చర్చిస్తారని, రాజకీయంగా ఆయనకు దోహదపడతారని అనడంలో ఎలాంటి నమ్మదగిన సమాచారం లేదనే చెప్పాలి. వ్యాపారవేత్తగా ఆదానీ బలమైన రోల్ పోషిస్తున్నారు. అందులో సందేహం లేదు. ఇదే సమయంలో జగన్ ఆయనకు సహకరించారు దానికీ సందేహం లేదు.
ఈ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని భవిష్యత్తులో జగన్‌కు ఆదాని దోహద పడతారు లేదా బీజేపీతో రాయబారం చేస్తారు అనడంలో మాత్రం అనే అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి జరిగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. ఒక వ్యాపారవేత్త రాజకీయంగా ఏదైనా డబ్బులు సంకూర్చవచ్చే తప్ప మధ్యవర్తిగా పనిచేసే అవకాశాలు తక్కువని పైగా కూటమి బలంగా ఉన్న ఈ నేపథ్యంలో జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే ఆయన వ్యాపారాలకు దెబ్బ పడే అవకాశం ఉంటుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.