• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  బద్ద వ్యతిరేకులైన అరబ్...

బద్ద వ్యతిరేకులైన అరబ్ పార్టీలతో దోస్తీ.. ఇజ్రాయెల్ లో కొత్త రాజకీయ చిచ్చు..

| ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. 120 స్థానాలున్న పార్లమెంట్‌లో నెతన్యాహు కూటమికి 53, ప్రతిపక్షానికి 48 సీట్లు వచ్చాయని కథనం పేర్కొంది. అరబ్ పార్టీలకు 19 స్థానాలు రావడంతో వాటి మద్దతు కీలకంగా మారింది. ప్రతిపక్ష నేత గాది ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

By - A.N.Kumar
Update: 2026-11-08 07:48 GMT

అసలు ఇజ్రాయెల్ అనే దేశం పుట్టిందే.. అరబ్, ఇస్లామిస్టులకు వ్యతిరేకంగా.. ఇజ్రాయెల్ ను ఇప్పటికీ అరబ్ ముస్లిం దేశాలు గుర్తించవు. ఆ దేశాన్ని లేకుండా చేయాలని ఏకంగా రెండు సార్లు ఇజ్రాయెల్ పైకి అరబ్ , ముస్లిం దేశాలన్నీ కలిసి యుద్ధానికి వెళ్లి ఓడిపోయాయి. యూదులకు, ముస్లింలకు పాలస్తీనా విషయంలో.. మతపరంగా తీవ్ర విభేదాలున్నాయి. అంతటి బద్ద విరోధులు ఇప్పుడు ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడడంతో కలిసిపోవడం ఆ దేశంలోనూ.. రాజకీయ పార్టీల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇరాన్ పైకి యుద్ధానికి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాల్లో పెను తుఫాను రేగింది. శత్రువులతో సరిహద్దుల్లో పోరాడుతున్న ఆ దేశం.. ఇప్పుడు తన సొంత గడ్డపైనే ఒక సరికొత్త రాజకీయ రణరంగాన్ని ఎదుర్కొంటోంది. "అరబ్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడితే.. ఇజ్రాయెల్ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది.. దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుంది" అంటూ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

అక్టోబర్ 27న జరిగిన ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలు దేశ రాజకీయాల్లో సరికొత్త తికమకకు తెరలేపాయి. 120 స్థానాలున్న నెస్సెట్‌ పార్లమెంట్ లో ఏ ఒక్క కూటమికీ స్పష్టమైన మెజారిటీ 61 సీట్లు దక్కలేదు. నెతన్యాహు కూటమికి 53 స్థానాలు రాగా.. మాజీ సైనికాధికారి గాది ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్షం 48 స్థానాలతో గట్టి పోటీనిచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా అరబ్ పార్టీలు రికార్డు స్థాయిలో 19 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీల మద్దతే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ‘‘హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థల పట్ల సానుకూలంగా ఉండే ఇస్లామిస్ట్ శక్తులు ప్రభుత్వంలో భాగమైతే ఇజ్రాయెల్ ఉనికికే ప్రమాదం" అని నెతన్యాహు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరప్ దేశాల్లో మతపరమైన శక్తుల ప్రభావం వల్ల నష్టపోతున్న ఉదంతాలను ప్రస్తావిస్తూ.. అదే దుస్థితి ఇజ్రాయెల్‌కు రాకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు. అరబ్ మైనారిటీల ప్రాతినిధ్యాన్ని దేశ భద్రతా కోణంలో చూస్తున్న నెతన్యాహు వాదన ఒకవైపు ఉంటే.. అన్ని అరబ్ పార్టీలను ఒకే గాటన కట్టలేమనేది ప్రతిపక్షాల వాదన.

ఈ రాజకీయ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐసాక్ హెర్జోగ్ రంగంలోకి దిగారు. నవంబర్ 7న ప్రభుత్వ ఏర్పాటుకు గాది ఐసెన్‌కోట్‌కు తొలి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆయనకు 28 రోజుల గడువు ఉంది. అయితే నెతన్యాహు మాత్రం తన మతపరమైన.. జాతీయవాద కూటమితో కూడిన 'జాతీయ ఐక్యత ప్రభుత్వం' మాత్రమే దేశాన్ని కాపాడగలదని గట్టిగా వాదిస్తున్నారు. మరోవైపు ఐసెన్‌కోట్ మాత్రం తీవ్రవాద భావజాల పార్టీలతో కలిసి నడిచేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేస్తున్నారు.

ఇది కేవలం ఒక ప్రభుత్వ మార్పిడికి సంబంధించిన పోరాటం కాదు. ఒకవైపు దేశ సార్వభౌమత్వం.. జాతీయ భద్రతను కాపాడుకోవాలనే తపన.. మరోవైపు ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఆకాంక్ష మధ్య నలుగుతున్న సున్నితమైన అంశం.

ఓవైపు ఇరాన్ తో యుద్ధం నడుస్తున్న వేళ అదే అరబ్ ఇస్లామిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే రేపు ఇజ్రాయెల్ యుద్ధాన్ని విరమిస్తుందా? హిజ్బుల్లా, హమాస్ లాంటి తీవ్రవాదులతో ఎలా వ్యవహరిస్తుంది? ప్రతిపక్ష నేత ప్రధాని అయితే పరిస్థితులు ెలా మారుతాయా? ఇజ్రాయెల్ ఎలా ముందుకెళుతుందన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతోంది.

Tags:    
  • israelpolitics 
  • benjaminnetanyahu 
  • israelelections 
  • arabparties 
  • iranisraelwar 

Similar News

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

70 మంది బాలికలను ట్రాప్ చేసిన భారతీయ విద్యార్థి.. బ్రిటన్‌లో 30 ఏళ్ల జైలు శిక్ష!

2026-11-14 11:30 GMT

అమెరికాలో ఏమైపోతోంది? మూడు నెలల కరెంట్ ఉండదనే భయంతో జనాల పరుగులు!

2026-11-14 10:43 GMT

పాకిస్థాన్‌లో ఉద్యోగాల కోసం దేశం విడుస్తున్న ప్రజలు.. అధికారుల విదేశీ ఆస్తులపై ఆరోపణలు!

2026-11-14 08:52 GMT

ట్రంప్ కొంపముంచేశాడు.. అధ్యక్ష రేసు నుంచి జేడీ వాన్స్ తప్పుకుంటారా?

2026-11-14 07:19 GMT

మొన్న ఎన్వీడియో.. నిన్న మైక్రోసాఫ్ట్.. నేడు విమానాలన్నీ బంద్.. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది?

2026-11-14 04:17 GMT

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

2026-11-13 16:36 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

హెచ్1బీ వీసాదారులపై మరో పిడుగు.. ఐబీఎం షురూ చేసింది..

2026-11-11 04:56 GMT

2008లో ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయ యువకుడు.. ఇప్పుడు ఆయన సాధించిన ఘనత ఏంటో తెలుసా?

2026-11-11 04:28 GMT

Copyright @2026

Powered by Blink CMS