• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Overseas >  IPL బాస్‌కి మాఫియా...

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

| ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ బ్రిటిష్ పౌరసత్వం పొందినట్లు ప్రకటించారు. 2026 సెప్టెంబర్ 15న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో వెల్లడించారు. 2010 నుంచి లండన్‌లో నివసిస్తున్న ఆయన నిర్ణయం వెనుక భారత ఆర్థిక కేసుల నుంచి రక్షణ పొందాలనే వ్యూహం ఉందన్న చర్చ మొదలైంది.

By - Sivaji Kontham
Update: 2026-11-15 05:29 GMT

జీవితంలో ఒకానొక ద‌శ‌లో మాఫియా బెదిరింపుల్ని ఎదుర్కొన్నాన‌ని ఐపీఎల్ బాస్ ల‌లిత్ మోదీ త‌న ఆవేద‌న‌ను బ‌హిరంగంగానే ఇంట‌ర్వ్యూల‌లో వ్య‌క్తం చేసారు. మాఫియా కార‌ణంగానే తాను క్రికెట్ కి దూరం కావాల్సొచ్చింద‌ని కూడా అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగుల‌కు స‌హ‌క‌రించ‌క‌పోతే క్రికెట్ ని వ‌దిలి వెళ్లిపోవాల‌ని దావూద్ ఇబ్ర‌హీం గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింద‌ని కూడా ఈ ఏడాది జూన్ లో జ‌రిగిన ఒక ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడిగా లలిత్ మోదీ ఆవేద‌న‌ను ప్ర‌పంచం అర్థం చేసుకుంది.

అయితే ఇటీవ‌లి కాలంలో ల‌లిత్ మోదీకి అలాంటి బెదిరింపులేవీ లేవు.. అయినా ఆయ‌న అనూహ్యంగా భార‌త పౌర‌స‌త్వాన్ని వ‌దిలి బ్రిటిష్ పౌరసత్వం కోసం పాకులాడ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ల‌లిత్ స్వ‌యంగా తాను అధికారికంగా బ్రిటిష్ పౌరసత్వం పొందినట్లు తాజాగా ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక `ఆక్స్‌ఫర్డ్ యూనియన్` సభలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని అధికారికం చేసారు. 15 సెప్టెంబర్ 2026న తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ప్రత్యేక వేడుకలో బ్రిటిష్ పౌరుడిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు వెల్లడించారు.

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ -3 పుట్టినరోజు సందర్భంగా ఈ వార్తను బ‌య‌టి ప్ర‌పంచానికి రివీల్ చేయ‌డం మరింత ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని పేర్కొంటూ `గాడ్ సేవ్ ది కింగ్!` అంటూ తన సోషల్ మీడియా పోస్ట్‌ను ముగించ‌గా ప్ర‌స్తుతం ఇది భార‌త‌దేశంలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

నిజానికి ఈ రోజుల్లో ఆయ‌న‌కు బెదిరింపులేవీ లేవు.. భారత్‌లో ఆర్థిక అవకతవకల కేసులు, దర్యాప్తు సంస్థల ఒత్తిడి నుండి శాశ్వతంగా రక్షణ పొందేందుకే ఇలా వ్యూహాత్మక అడుగు వేశారనే విశ్లేషిస్తున్నారు. మరోవైపు.. గత కొన్నేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ తనకు సొంత ఇల్లులా మారిందని లలిత్ మోదీ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఆ దేశ ప్రజలు, వ్యవస్థలు, సంప్రదాయాలు, విలువలపై తనకు ఎంతో గౌరవం ఉందని.. బ్రిటిష్ పౌరుడిగా మారడం కేవలం గౌరవం మాత్రమే కాదని అదొక బాధ్యత అని పేర్కొన్నారు. 2010 నుండి లండన్‌లోనే నివసిస్తున్న మోదీ ఇప్పుడు అధికారికంగా యూకే పౌరుడిగా మారడం ద్వారా భారత చట్టపరమైన అప్పగింత ప్రక్రియల నుండి మరింత బలమైన రక్షణ పొందే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

ఇక లలిత్ మోదీ వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వివాదాలు, సంచలనాలకు కేంద్రబిందువుగానే నిలిచింది. ముఖ్యంగా మాజీ విశ్వసుందరి బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తో లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమాయణం ఎపిసోడ్ అప్పట్లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మాల్దీవుల్లో వెకేషన్‌కు సంబంధించిన రొమాంటిక్ ఫోటోలను లలిత్ మోదీ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఆ త‌ర్వాత బ్రేక‌ప్ అవ్వ‌డం కూడా మ‌రో వింత‌గా చెప్పుకున్నారు.

క్రికెట్.. ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు.. ప్రేయ‌సి వంటి అంశాల కార‌ణంగా ల‌లిత్ మోదీ పేరు నిరంత‌రం భార‌త‌దేశ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. సుదీర్ఘకాలంగా లండన్‌లో స్థిరపడిన ఆయ‌న త‌న‌ జీవితానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించుకోవడానికే బ్రిటిష్ పౌరసత్వాన్ని ఎంచుకున్నారని ఇప్పుడు స్పష్టమవుతోంది. పూర్తిస్థాయి బ్రిటిష్ పౌరుడిగా మారిన లలిత్ మోదీ విషయంలో భారత దర్యాప్తు సంస్థల తదుపరి అడుగులు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Tags:    
  • lalitmodi 
  • britishcitizenship 
  • iplfounder 
  • indiancricket 
  • oxfordunion 
  • ukcitizenship 

Similar News

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

70 మంది బాలికలను ట్రాప్ చేసిన భారతీయ విద్యార్థి.. బ్రిటన్‌లో 30 ఏళ్ల జైలు శిక్ష!

2026-11-14 11:30 GMT

అమెరికాలో ఏమైపోతోంది? మూడు నెలల కరెంట్ ఉండదనే భయంతో జనాల పరుగులు!

2026-11-14 10:43 GMT

పాకిస్థాన్‌లో ఉద్యోగాల కోసం దేశం విడుస్తున్న ప్రజలు.. అధికారుల విదేశీ ఆస్తులపై ఆరోపణలు!

2026-11-14 08:52 GMT

ట్రంప్ కొంపముంచేశాడు.. అధ్యక్ష రేసు నుంచి జేడీ వాన్స్ తప్పుకుంటారా?

2026-11-14 07:19 GMT

మొన్న ఎన్వీడియో.. నిన్న మైక్రోసాఫ్ట్.. నేడు విమానాలన్నీ బంద్.. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది?

2026-11-14 04:17 GMT

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

2026-11-13 16:36 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

హెచ్1బీ వీసాదారులపై మరో పిడుగు.. ఐబీఎం షురూ చేసింది..

2026-11-11 04:56 GMT

2008లో ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయ యువకుడు.. ఇప్పుడు ఆయన సాధించిన ఘనత ఏంటో తెలుసా?

2026-11-11 04:28 GMT

Copyright @2026

Powered by Blink CMS